ఇద్దరు కూతుళ్లు పెళ్లి కాకుండానే గర్భవతులయ్యారని తెలిసి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. బాగా చదివి తనకు మంచిపేరు తెస్తారని భావిస్తే.. ఇద్దరు కూతుళ్లు గర్భవతులయ్యారని తెలిసి ఆయన తట్టుకోలేకపోయాడు. 

కృష్ణా జిల్లా ఉయ్యూరులో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కూతుళ్లు పెళ్లి కాకుండానే గర్భవతులయ్యారని తెలిసి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న తండ్రి ఇద్దరు కూతుళ్లను కష్టపడి చదివిస్తున్నాడు. వీరిద్దరూ వేర్వేరు కాలేజీల్లో ఒకరు డిగ్రీ, మరొకరు ఇంటర్ చదువుకుంటున్నారు. ఇద్దరికీ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారికి పరీక్షలు చేసిన వైద్యులు .. ఇద్దరూ గర్భం దాల్చినట్లు ధ్రువీకరించారు. చిన్న కుమార్తెకు తొమ్మిదో నెల.. పెద్ద కుమార్తెకు ఆరో నెల అని తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు డాక్టర్లు. అనంతరం వీరిద్దరిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి 20 రోజుల క్రితం అమ్మాయిల తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బాగా చదివి తనకు మంచిపేరు తెస్తారని భావిస్తే.. ఇద్దరు కూతుళ్లు గర్భవతులయ్యారని తెలిసి ఆయన తట్టుకోలేకపోయాడు. ఈ ఘటనతో ఉయ్యూరులో విషాదం చోటు చేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred