నెల్లూరు జిల్లాలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. గూడూరులోని జీఎస్ రాయల్ సెంటర్ వద్ద కన్న కూతురిపై ఓ తండ్రి కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలనైన ఆమెను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు.

కాగా.. కూతురు దేవయాని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా దేవయాని ఇటీవల కులాంతర వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే.. దేవయానిపై తండ్రి కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది.

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మిర్యాలగూడలో  ప్రణయ్, హైదరాబాద్ లో మాధవిలు కూడా ఇదేవిధంగా కత్తిదాడికి గురయ్యారు. ఈ సంఘటనలు మరవకముందే.. మరో సంఘటన తెలుగు రాష్ట్రాల్లో కలవరం రేపుతోంది.