టీవి రిమోట్ కోసం తండ్రి, కూతుళ్ల గొడవ, మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య

First Published 27, Jul 2018, 3:56 PM IST
Father and daughter fight for tv remote, father suicide
Highlights

టీవి లో చానల్ మార్పు విషయంలో తండ్రి, కూతుళ్ల మధ్య సరదాగా జరిగిన గొడవ తండ్రి ఆత్మహత్యకు దారితీసింది. తనకు ఇష్టమైన ఛానల్ చూస్తుండగా కూతురు రిమోట్ తీసుకుని ఛానల్ మార్చిందని మనస్థాపంతో తండ్రి ఆత్మహత్మ చేసుకున్నాడు. ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
 
విశాఖ పట్నంలోని మహారాణి పేట ప్రాంతంలోని కృష్ణానగర్ లో నక్కా కొండల్ రావు(52) తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు.  అయితే నిన్న గురువారం మధ్యాహ్నం సమయంలో కొండల్ రావు తన కూతురు సాయి ప్రశాంతితో కలిసి టీవీ చూస్తున్నాడు. అయితే అతడు ఓ ఛానల్ చూస్తుండగా కూతురు రిమోట్ తీసుకుని మరో ఛానల్ మార్చింది. దీంతో తండ్రి కూతురు మద్య స్వల్ప వాగ్వివాదం జరిగింది.

దీంతో తన గదిలోకి వెళ్లిన కొండల్ రావు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు ఎంతకూ ఆ గదిలోంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి బలవంతంగా తలుపులు తెరిచి చూడగా అప్పటికే అతడు ఊపిరాడక చనిపోయి ఉన్నాడు. ఈ విషయం బైటపడితే ఎక్కడ ప్రశాంతిపై వస్తుందోనని కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని గుట్టుగా ఖననం చేయాలని స్మశానవాటికకు తీసుకెళ్లారు.

కుటుంబ సభ్యుల ఆందోళనతో పాటు మృతదేహం మెడపై కమిలిపోయిన గాయాలుండటంతో కాటికాపరికి అనుమానం వచ్చింది. దీంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో శ్మశాన వాటికకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మఈతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
loader