అనంతపురం జిల్లాలోని మురడిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలువురు రైతులు పురుగుల మందు డబ్బాలతో పొలాల్లో బైఠాయించారు.
అనంతపురం జిల్లాలోని మురడిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలువురు రైతులు పురుగుల మందు డబ్బాలతో పొలాల్లో బైఠాయించారు. వారి పొలాల్లో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సోదరుడు కొండారెడ్డి అధికారులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యం చేస్తున్నాడని రైతులు ఆరోపించారు. బలవంతంగా రోడ్డు వేస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల వద్ద నుంచి పురుగుల మందు డబ్బాలను లాక్కున్నారు. అయినప్పటికీ రైతులు పొలాల్లో కూర్చుని నిరసన తెలియజేశారు. తమకు న్యాయం చేయాలని అధికారులు వేడుకుంటున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
