సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌)కు దరఖాస్తు చేసుకున్నారు. తన దరఖాస్తును అనుమతించాలని కోరుతూ ఆయన మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. ప్రస్తుతం మహారాష్ట్ర అదనపు డీజీగా ఆయన పనిచేస్తున్నారు. అయితే, పదవీ విరమణకు ముందే ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అప్పట్లో వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసు, గాలి జనార్దన్‌రెడ్డి మైనింగ్‌ కేసుల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తులో లక్ష్మీనారాయణ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జగన్ కేసుల్లో వివాదాస్పద అధికారిగా కూడా ప్రచారంలో ఉన్నారు.