Asianet News TeluguAsianet News Telugu

సవాంగ్ పనితీరు స్ఫూర్తినిచ్చింది : డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పనితీరు త‌న‌కు చాలా స్ఫూర్తినిచ్చిందని నూతన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సవాంగ్‌ సేవలు గుర్తించి  ప్రభుత్వం ఆయనకు మరో పదవిని అప్పగించిందన్నారు.  త‌న‌ను  డీజీపీగా ఎంచుకున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు అని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సవాంగ్ వీడ్కోలు సందర్భంగా నూతన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు.
 

Farewell To IPS Gautam Sawang And Welcome To DGP Kasireddy Rajendranath
Author
Hyderabad, First Published Feb 19, 2022, 11:29 AM IST

ఇటీవల ఏపీ ప్రభుత్వం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌‌ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డిని నూత‌న డీజీపీగా బాధ్యతలు అప్ప‌జెప్పిన విష‌యం తెలిసిందే. అయితే నేడు ఏపీకి నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సవాంగ్‌ సేవలు గుర్తించి ప్రభుత్వం ఆయనకు మరో బాధ్యతను అప్పగించిందన్నారు. సవాంగ్ వీడ్కోలు సందర్భంగా నూతన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ..   మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పనితీరు తనకు చాలా స్ఫూర్తినిచ్చిందని నూతన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రజా విశ్వాసం పోలీసులకు ఎప్పుడూ శిరోధార్యమే. పోలీసు వ్యవస్థపై ప్రజలకు అత్యున్నత స్థాయి నమ్మకం ఉంటుంది. ప్రజల నమ్మకానికి భిన్నంగా వ్యవహరిస్తే తీవ్ర ప్రభావం ఉంటుంది. తప్పుడు ఆరోపణలపై దిగులు చెందాల్సిన అవసరం లేదు. పోలీసులు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలి.

త‌న‌ పై నమ్మకం ఉంచి డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలని ఆయన వెల్లడించారు. ఆ నమ్మకాన్ని మరింత నిలబెట్టుకునే విధంగా పని చేస్తానన్నారు. ప్రజా విశ్వాసం పోలీసులకు ఎప్పుడూ శిరోధార్యమే అని అన్నారు. జిల్లా ఎస్పీలు అందుకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు అత్యున్నత స్థాయి నమ్మకం ఉంటుందని.., ఆ నమ్మకానికి భిన్నంగా వ్యవహరిస్తే తీవ్ర ప్రభావం ఉంటుందని అన్నారు. ఎవరు తప్పుచేసినా మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందన్నారు. తప్పుడు ఆరోపణలపై దిగులు చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆరోపణలపై ఉన్నత స్థాయిలో విచారణ చేస్తామని, పోలీసులు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలని సూచించారు.

 పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఆకాంక్షలు ఉంటాయని, ఏదైనా మారుమూల ప్రాంతంలో ఒక కానిస్టేబుల్ తప్పు చేసినా మొత్తం పోలీసు వ్యవస్థ పైనే ఆరోపణలు వస్తాయని ఆయన అన్నారు. మతాల మధ్య సామరస్యం ఉండాలని, చిన్న పొరపాటు కూడా జరక్కుండా గౌతమ్ సవాంగ్ ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. టెక్నాలజీని పోలీసు వ్యవస్థకు సమర్ధవంతంగా అందించారని, గౌతమ్ సవాంగ్ సామర్ధ్యాన్ని చూసే ముఖ్యమంత్రి మరో కీలక బాధ్యతలు అప్పగించారని ఆయన తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని, గ‌త రెండేళ్ల 8 నెలలు డీజీపీగా కొనసాగించిన సీఎం జగన్​కు ప్ర‌త్యేక‌ ధన్యవాదాలు తెలిపారు. తాను డీజీపీగా పనిచేసిన సమయంలో చిన్నారులు, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. సైబర్‌ మిత్ర, దిశ పోలీసుస్టేషన్‌లు చక్కగా పని చేస్తున్నాయని తెలిపారు. అలాగే.. రాష్ట్రంలో మొబైల్‌ సేవా యాప్‌కు విశేష స్పందన వచ్చిందని, దిశ, మొబైల్ యాప్ నుంచి కూడా కేసులు నమోదయ్యేలా చేశామ‌ని తెలిపారు. ఈ  ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపామని తెలిపారు.

బాధితులు స్టేషన్‌కు రాకుండానే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామ‌నీ, దాదాపు 36 శాతం కేసులు డిజిటల్‌గా వచ్చిన ఫిర్యాదులేన‌ని తెలిపారు. 75 శాతం కేసుల్లో కోర్టులు విచారణ చేసి శిక్ష విధించాయ‌ని తెలిపారు. 'స్పందన' ఫిర్యాదుల్లో 40 వేలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు. మహిళలు, చిన్నారుల భద్రతకు స్పందన, ఆపరేషన్ ముస్కాన్ తీసుకొచ్చామ‌ని, ఏపీ పోలీసు వ్యవస్థలో డిజిటల్‌గా చాలా మార్పులు తేగలిగామ‌ని  గౌతమ్‌ సవాంగ్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios