చిత్తూరు జిల్లాలో ఓ దొంగ స్వామి బాగోతం బయటికొచ్చింది. బంగారుపాళ్యంలో మోసాలకు పాల్పడిన దొంగ స్వామిపై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. 

ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు దొంగ స్వామిజీలు రెచ్చిపోతున్నారు. మాయ మాటలతో బురిడి కొట్టించి మోసాలకు పాల్పడుతున్నారు. అయితే వారి మోసాలు వెలుగులోకి వచ్చాక బాధితులు లబోదిబోమంటున్నారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించిన జనాల్లో మార్పు రావడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ దొంగ స్వామి బాగోతం బయటికొచ్చింది. బంగారుపాళ్యంలో మోసాలకు పాల్పడిన దొంగ స్వామిపై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. 

గుడికి వచ్చే మహిళా భక్తులే టార్గెట్‌గా దొంగ స్వామి ఆంజనేయులు మోసాలకు పాల్పడ్డాడు. ఓం శక్తి ఆలయం నిర్మాణం పేరుతో చందాలు వసూలు చేశాడు. అమాయక మహిళల వద్ద చిట్టీల పేరుతో రూ. 25 కోట్లు వసూలు చేశాడు. అయితే నాలుగు రోజుల క్రితం దొంగ స్వామి ఆంజనేయులు భార్యతో కలిసి ఉడాయించాడు. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు.. పోలీసులను ఆశ్రయించారు. 

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దొంగ స్వామి ఆంజనేయులపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న దొంగ స్వామిజీ కోసం కొనసాగుతున్న పోలీసులు గాలింపు చేపట్టారు.