దేవుడి పేరుతో యువతీ, యువకులతో రాసలీలలు.. ఇతను మరో డేరాబాబా...

విశాఖ జిల్లాలో ఓ డేరాబాబా భాగోతం బయటపడింది. యువతీ, యువకులను మాయమాటలతో లోబరుచుకుని అకృత్యాలకు పాల్పడుతున్నాడు. దీనిమీద అతని దగ్గరున్న ఓ యువతి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ఫేక్ బాబా మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

 

fake baba in visakha district payakaraopeta, case registered women freed

పాయకరావుపేట : visakhapatnam district పాయకరావుపేటలో దేవుడి పేరుతో రాసలీలలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై పోలీసులు case నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రం suryapet జిల్లాకు చెందిన ఓ యువతి ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు అయ్యింది. పోలీసుల కథనం ప్రకారం విజయవాడ కృష్ణలంకకు చెందిన అంబటి అనిల్ రైల్వేలో కారుణ్య నియామకం కింద Ticket Collector గా చేరాడు.  ఐదేళ్ల క్రితం బెజవాడ నుంచి విశాఖ జిల్లా పాయకరావుపేటకు  మకాం మార్చి, Premadasu పేరుతో babaగా మారాడు. భక్తుల నుంచి భారీగా విరాళాలు సేకరించి, పాయకరావుపేట శ్రీరాంపురంలో  అధునాతన భవంతి నిర్మించాడు.

యువతీ, యువకులను లోబరుచుకుని ఆ భవనంలో వారితో వికృత చేష్టలకు పాల్పడేవాడు. అతని చేష్టలు భరించలేకపోయిన ఆ యువతి, మరికొందరు యువకులు గురువారం పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 376, 344, 354, 506, 493, 374, 312, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు పాయకరావుపేట సీఐ నారాయణరావు తెలిపారు. గురువారం రాత్రి నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠచందోల్ ఆ భవనాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న యువతుల నుంచి సిడిపిఓ, పోలీసులు స్టేట్ మెంట్లు రికార్డు చేస్తున్నారు. వారిలో కొంతమంది ఇష్టపూర్వకంగానే ఇక్కడ ఉన్నట్లు చెబుతున్నారు.

స్పందించిన ఎమ్మెల్యే..
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గొల్ల బాబురావు వెంటనే స్పందించారు. సీఐ నారాయణ రావు, తహసిల్దార్ పి.అంబేద్కర్,  ఎంపీడీవో సాంబశివరావు, ఎస్ ఐ ప్రసాద్, సిడిపిఓ నీలిమలతో  సమావేశం ఏర్పాటు చేశారు. వీరంతా ఒక కమిటీగా ఏర్పడి, భవనంలో ఉన్న వారిని బంధువులకు అప్పగించాలని ఆదేశించారు. 

ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం ఇలాంటి ఫేక్ స్వాముల బండారం మాడుగులలో బయటపడింది. మంత్రాలకు చింతకాయలు రాలతాయా? అంటే రాలగొట్టి చూపిస్తాం అంటూ ఈ నfake babaలు జనాల్ని మోసం చేస్తున్నారు. గుప్తనిధులు, సంతానం పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. lemon water తాగితే సంతానం కలుగుతుందంటూ నయా fraudకి తెరలేపిన ఈ నకిలీ బాబాలు గుట్టును పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెడితే...

నకిలీ స్వామి అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు బురిడీ బాబాలను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్ కు తరలించారు.  సీఐ కృష్ణ మోహన్ కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపాటి గ్రామానికి చెందిన పర్వతం స్వామి అలియాస్ నాగరాజు స్వామి, పర్వతం సైదులు అలియాస్ సహదేవ స్వామి, సిరసాల బక్కయ్య కలిసి స్వామి అవతారం ఎత్తి ‘మీ ఇంట్లో గుప్తనిధులు తీస్తాం, మేము మంత్రాలు చదివితే సర్వ రోగాలు మాయం అవుతాయి, మేమిచ్చే నిమ్మకాయ నీరు తాగితే సంతానం కలుగుతుందని’ ప్రజలను మోసం చేస్తున్నారు. 

మండలంలోని కలకొండ, అన్నెబోయిన్పల్లి,  అందుగుల, పరిసర గ్రామాల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేశారు.  ప్రజల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి..  వారి వద్ద నుంచి సుమారు రూ.13  లక్షలు  స్వాధీనం  చేసుకుని…రిమాండ్ కు పంపినట్లు చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios