Asianet News TeluguAsianet News Telugu

నేటి నుండి ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో యాప్ ఆధారిత హాజరు: వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు

రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఫేస్ రికగ్ననైజేషన్ యాప్ ద్వారానే హాజరు నమోదు చేసుకోవాలని ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  ఈ విధానాన్ని విరమించుకోవాలని కోరుతున్నాయి. 

Face recognition attendance system in all AP government schools
Author
First Published Sep 1, 2022, 9:42 AM IST

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు  ఫేస్ రికగ్ననైజేషన్  యాప్  ద్వారా తమ హాజరును నమోదు చేసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జాారీ చేసింది. ఇవాళ్టి నుండే ఉపాధ్యాయులు తమ హాజరును ఫేస్ రికగ్ననైజేషన్ యాప్ ద్వారానే నమోదు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ యాప్ తో సాంకేతిక సమస్యలున్నాయని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.ఈ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ విషయమై  ప్రభుత్వం నుండి స్పష్టత రాకముందే  ఇవాళ్టి నుండి ఈ యాప్ ద్వారానే హజరును నమోదు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ సాయంత్రం ఉపాధ్యాయ సంఘాలతో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చించనున్నారు. ఇవాళ సాయంత్రం లోపుగా స్పష్టత రాకపోతే రేపటి నుండి అన్ని యాప్ లను డౌన్ చేస్తామని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.

 ఈ ఏడాది ఆగష్టు 16వ తేదీ నుండి యాప్ ఆధారిత హజరు నమోదు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. అయితే ఈ యాప్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఉదయం 9 గంటలలోపుగా ఈ యాప్ లో ఉపాధ్యాయులు తమ హాజరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే యాప్ డౌన్ లోడ్ చేసుకొని హాజరు నమోదు చేసుకోవడానికి ప్రయత్నించిన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి వేచి చూసినా కూడా యాప్ లో హాజరు నమోదు కాలేదు.

టెక్నికల్ సమస్యలు సరి చేయకుండానే హాజరు నమోదును ఇదే యాప్ ద్వారా చేయాలని చెప్పడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి. మరో వైపు ప్రతి స్కూల్ లో బయోమెట్రిక్ మెషీన్లను అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. తమ ఫోన్ల ద్వారా ఫేస్ రికగ్ననైజేషన్ యాప్ ద్వారా  హాజరు నమోదు చేసుకోవడం ద్వారా తమ వ్యక్తిగత సమాచారం కూడా  కోల్పోయే అవకాశం ఉందని కూడా ఉపాధ్యాయ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేశాయి.  అయితే ఈ విషయమై ఆగష్టు 18న ఉపాధ్యాయ సంఘాలతో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ  చర్చించారు. అయితే ఆగస్టు 31వ తేదీ లోపుగా ఈ యాప్ ద్వారా  హాజరు నమోదును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయ సంఘాలకు సూచించారు.

also read:ఏపీలో నేటి నుండి యాప్ ఆధారిత హాజరు: వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు

మరోసారి సమావేశమైన తర్వాత యాప్ విషయమై నిర్ణయం తీసుకొందామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. అయితే ఇవాళ సాయంత్రం ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ చర్చించనున్నారు. మంత్రితో చర్చలు జరపక ముందే ఫేస్ రికగ్ననైజేషన్ యాప్ లో హాజరు విధానాన్ని తప్పనిసరి చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  గతంలో 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడ సగం రోజు  వేతనం కట్ చేయనున్నారు. అయితే స్కూల్ కు వచ్చిన ఉపాధ్యాయులు తమ హాజరు నమోదు కోసం 10 నిమిషాల వెసులుబాటును కేటాయించింది ప్రభుత్వం. ప్రభుత్వ ఆసుపత్రిలో మాదిరిగా బయో మెట్రిక్ పరికరాలను ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios