తనకంటే వయసులో చాలా పెద్దావిడతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ చివరకు అందుకు అడ్డుగా వున్నాడని ఆమె భర్తను అతి కిరాతకంగా హతమార్చాడో కిరాతకుడు. ఈ దారుణం విశాఖపట్నంలో చోటుచేసుకుంది.
విశాఖపట్నం: వావివరసలు లేవు, వయసుతో సంబంధం లేదు... కేవలం శారీరక సుఖం దక్కితే చాలనుకునే అక్రమ సంబంధాలు (illegal affair), వివాహేతర సంబంధాలు (extramarital affair) ఇటీవల కాలంలో మరీ ఎక్కువయిపోతున్నాయి. ఈ విపరీత దోరణి మితిమీరిపోయి చివరకు భార్యలను చంపుతున్న భర్తలే కాదు భర్తలను చంపుతున్న భార్యలు పెరిగిపోయారు. విశాఖపట్నం జిల్లాలో ఇలాంటి దారుణమే వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం (visakhapatnam) నగరంలోని ఎండాడ ప్రాంతంలో మత్యు శ్రీనివాసరావు(43) భార్యతో కలిసి నివాసముండేవాడు. వీరి పెద్ద కొడుకుకు వివాహమవగా కోడలితో వేరుగా వుండగా చిన్న కొడుకు కూడా పెళ్లీడుకు వున్నాడు. అతడు కూడా ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతంలో వుండగా భార్యభర్తలిద్దరే ఎండాడలో వుండేవారు. శ్రీనివాసరావు ఓ పర్నిచర్ షాప్ లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.
కల్లు తాగే అలవాటున్న శ్రీనివాసరావు ప్రతిరోజూ ఓ కల్లు కాంఫౌండ్ వద్దకు వెళ్లేవాడు. ఈ క్రమంలోనే అతడికి చాకలిపేటకు చెందిన లక్ష్మణ్(26) అనే యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య పరిచయం కాస్తా స్నేహంగా మారడంతో ఓరోజు కల్లు తాగిన తర్వాత కలిసి భోజనం చేద్దామని భావించారు. దీంతో శ్రీనివాసరావు యువ స్నేహితున్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇదే అతడి పాలిట శాపంగా మారింది. శ్రీనివాసరావు ఇంటికి బోజనానికి వెళ్లిన లక్ష్మణ్ కన్న అతడి భార్యపై పడింది.
ఈ క్రమంలోనే తరచూ శ్రీనివాసరావు ఇంటికి వెళుతూ అతడి భార్యతో పరిచయం పెంచుకున్న లక్ష్మణ్ చివరకు ఆమెను వలలో వేసుకున్నాడు. ఇద్దరి మధ్యా వివాహేతర బంధం ఏర్పడింది. కొంతకాలం ఇలా గుట్టుగా సాగినా ఓ రోజు శ్రీనివాసరావుకు వీరిద్దరు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. దీంతో ఇద్దరినీ తీవ్రంగా మందలించాడు. అయినప్పటికీ వీరిద్దరూ తీర్చుమార్చుకోకుండా ఏకంగా లేచిపోయి నగరంలోనే రైల్వే న్యూ కాలనీలో కాపురం పెట్టారు.
వీరి ఆచూకీ తెలిసుకున్న శ్రీనివాసరావు అక్కడికి వెళ్లి గొడవకు దిగాడు. దీంతో అతడికి నచ్చజెప్పి తనవెంట బైక్ పై తీసుకెళ్లిన లక్ష్మణ్ అతి దారుణంగా కొట్టిచంపాడు. ఆ తర్వాత ప్రియురాలితో కలిసి విజయవాడకు మకాం మార్చాడు. ఈ హత్యపై కేసు నమోదు చేసి నిందితుడు లక్ష్మణ్ కోసం గత తొమ్మిది నెలలుగా పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అతడు విశాఖకు రాగా సమాచారం అందుకున్న పోలీసులు అరెస్ట్ చేసారు.
ఇదిలావుంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ మహిళ వివాహేతర సంబంధాలు మరో మహిళ ప్రాాణాలను బలితీసుకున్నాయి. అంబటిరాయునిపాలెం గ్రామానికి చెందిన నూర్జహాన్ కు పెళ్లయి భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలోనే వివాహితుడైన సమీప బంధువు షేక్ రబ్బానీతో ఆమెకు చనువు పెరిగి అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరిమధ్య బంధం మరింత పెరిగి సహజీవనం చేయసాగారు. ఇలా దాదాపు ఎనిమిదేళ్ల పాటు వీరి సహజీవనం సాఫీగా సాగింది. ఈ క్రమంలోనే వీరు సంతానాన్ని పొందారు.
అయితే కాపురం పెట్టిన ఒంగోలులోనే రబ్బాని ఓ టీస్టాల్ నడిపిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తనకు సహాయంగా వుంటాడని సత్యనారాయణపురంకు చెందిన మండ్ల కాశీకుమార్ ను టీస్టాల్ లో పనికి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తరచూ రబ్బానీ ఇంటికి వెళ్లడంతో నూర్జహాన్ తో కాశీకుమార్ కు చనువు పెరిగింది. ఇద్దరు మధ్యా చనువు మరింత పెరిగి అక్రమ సంబంధంగా మారింది. దీంతో సహజీవనం చేస్తున్న రబ్బానీని విడిచి కాశీతో లేచిపోయింది నూర్జహాన్.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన రబ్బానీ నూర్జహాన్ వదిన మీరాంబీ దీనంతనటికి కారణమని భావించాడు. తనకు నూర్జహాన్ ను దూరం చేయాలనే మీరాంబీ ఇదంతా చేయించిందని అనుమానించాడు. దీంతో ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు రబ్బానీ. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడిచేసాడు. ఈ దాడిలో మీరాంబీ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
తల్లి మీరాంబీపై జరుగుతున్న దాడిని అడ్డుకోడానికి అలీఫ్(23) ప్రయత్నించాడు. దీంతో రబ్బానీ అతడిని కూడా కత్తితో పొడిచాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో అలీఫ్ కూడా ఘటనా స్థలంలోనే మరణించాడు. ఇంతటితో ఆగకుండా తన ప్రియురాలిని లేపుకుపోయిన కాశీకుమార్ ను కూడా హతమార్చడానికి రబ్బానీ ప్రయత్నించి చివరకు పోలీసులకు చిక్కాడు.
