Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం : భర్త హత్యను ప్రోత్సహించిన భార్య.. పారిపోతుండగా అరెస్ట్...

వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను హత్య చేసేందుకు ప్రోత్సహించిందో భార్య. హత్య చేసిన  నిందితులతో పాటు సహకరించిన భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 

Extra marital affair : Wife encouraged husband's murder, arrested in andhrapradesh
Author
First Published Aug 29, 2022, 8:01 AM IST

చిత్తూరు : చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలోని దేవుల చెరువు పంచాయతీ గొల్లవారి పల్లెకు చెందిన శ్రీనివాసులు (32) ఇటీవల దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న వేణుగోపాల్, శంకర్ లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులోభర్త హత్యను  ప్రోత్సహించిన నిందితురాలు శ్రీనివాసులు భార్య శోభారాణిని కూడా పోలీసులు ఆదివారం అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇన్చార్జి సీఐ శివాంజనేయులు, ఎస్సై డివై స్వామిల కథనం మేరకు… శ్రీనివాసులు హత్య కేసులో నిందితుడైన వేణుగోపాల్… శోభారాణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 

ఈ నేపథ్యంలో తమ అక్రమ సంబంధానికి ఆమె భర్త అడ్డు వస్తున్నాడని.. అతడిని హతమార్చాడానికి పథకం పన్ని.. అమలు చేశాడు. ఇందుకు భార్య శోభారాణి కూడా సహకారం అందించినట్లు తెలిపారు. శోభారాణి బెంగళూరుకు వెళ్లేందుకు ఉదయం 11 గంటల సమయంలో వేపూరికోట క్రాసులో ఉండగా సమాచారం తెలుసుకున్న ఇన్చార్జి సీఐ శివాంజనేయులు, ఎస్సై డివై స్వామీలు అదుపులోకి తీసుకుని.. అరెస్టు చేసి.. రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.

వైద్య విద్యార్థిని హత్యకేసులో నిందితుడి అరెస్ట్.. భుజంపై, వీపుపై పేరు, ఫొటో టాటూలతో బ్లాక్ మెయిల్...

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం పేరూరుకు చెందిన భార్యాభర్తల మిస్సింగ్ మిస్టరీని ఎనిమిదేళ్ల తర్వాత శనివారం పోలీసులు చేధించారు. దంపతులు అదృశ్యాన్ని హత్యగా తేల్చారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్యలు జరిగాయని సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ రజితరెడ్డి, గ్రామస్థుల కథనం ప్రకారం… దేవరకద్ర మండలంలోని మండలంలోని ఇస్రంపల్లికి చెందిన బుర్రన్  పేరూర్ లో నానేష్, మహమ్మద్ రఫీతో కలిసి బొగ్గు అమ్మేవాడు.  

ఈ క్రమంలో పేరూర్ కే చెందిన దంపతులు బోయ శాంతమ్మ (32), బోయ ఆంజనేయులు (37)లతో బుర్రన్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో బుర్రన్ దగ్గర వారు రూ.20వేలు అప్పుగా తీసుకున్నారు. అప్పు తీర్చాలంటూ బుర్రన్ తరచూ వారి ఇంటికి వెళ్లే క్రమంలో శాంతమ్మతో బుర్రన్ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆంజనేయులు తన భార్యతో మాట్లాడితే చంపుతానని బుర్రన్ ను హెచ్చరించాడు. దీంతో ఆంజనేయులును హతమార్చాలని బుర్రన్ నిర్ణయించుకున్నాడు. 2014 ఏప్రిల్ 19న మాట్లాడుకుందాం రమ్మంటూ ఆంజనేయులు పెద్దమందడి మండలంలోని గ్రామశివారులోని ఓ పొలం వద్దకు తీసుకువెళ్లి నానేష్, రఫీలతో కలిసి గొంతునులిమి చంపేశాడు. 

తరువాత ఈ విషయాన్ని శాంతమ్మకు చెప్పాడు. కానీ శాంతమ్మ భయపడి ఈ విషయాన్ని బయటకు చెబుతాను అంది. దీంతో బుర్రన్ ఆమెను కూడా చంపాలనుకున్నాడు. బావమరుదుల సహాయంతో ఆమెను గ్రామ శివారులోని పెద్దచెరువు వద్దకు తీసుకువెళ్లి చీర కొంగును గొంతుకు బిగించి.. ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఈ హత్యలు బయటపడకుండా ఉండేందుకు మృతదేహాలను పాతి పెట్టాడు.2020 ఏప్రిల్ 17న మండలంలోని పేరూరు శివారులో స్మశాన వాటిక నిర్మాణం కోసం గుంతలు తవ్వుతుండగా ఓ చీర, ఎముకలు బయటపడ్డాయి.

 ఈ సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. గత పదేళ్లుగా తప్పిపోయిన మహిళల సమాచారం సేకరించారు. ఈ క్రమంలో శాంతమ్మ పేరు రావడంతో మృతురాలి కుమారుడు శ్రీకాంత్కు డీఎన్ఏ టెస్ట్ చేశారు.  అది ఎముకల డీఎన్ఏతో సరిపోవడంతో మృతి చెందింది శాంతమ్మగా నిర్ధారించి, దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నిందితులు సర్పంచ్ ను కలిసి నిజం చెప్పారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. మరో నిందితుడు రఫీ ఏడాది క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios