Asianet News TeluguAsianet News Telugu

వైద్య విద్యార్థిని హత్యకేసులో నిందితుడి అరెస్ట్.. భుజంపై, వీపుపై పేరు, ఫొటో టాటూలతో బ్లాక్ మెయిల్...

ఏపీలోని హిందూపురంలో తెలంగాణకు చెందిన వైద్యవిద్యార్థి మృతి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో వచ్చిన ఆమె ప్రియుడే ముఖానికి దిండు అదిమి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. 

Accused arrested in case of murder of medical student in Hindupur
Author
First Published Aug 29, 2022, 6:47 AM IST

హిందూపురం : వైద్య విద్యార్థిని హత్యకేసులో నిందితుడిని ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను అనంతపురం డిఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. ములుగు జిల్లా మంగపేటకు చెందిన అక్షిత (26) కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో  గైనకాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తోంది. ఆమెకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లో ఉండే ఇంటీరియర్ డిజైనర్ మహేష్ వర్మ పరిచయమయ్యాడు. ఇంస్టాగ్రామ్ లో అప్పుడప్పుడు వీడియో కాల్ చేసి మాట్లాడేవాడు.

ఆమె పనిచేస్తున్న చిక్బల్లాపూర్ కు వెళ్లి ప్రేమిస్తున్నాను అని వెంట పడ్డాడు. దీనికి ఆమె తిరస్కరించింది. దీంతో, నీ ఫొటోలు మార్పింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో చేస్తానని బెదిరించడంతో... ఆమె భయపడి అతనికి లొంగిపోయింది. ఇకపై నన్ను వదిలి వేయాలని కోరడంతో నమ్మబలికి అతను ఈ నెల 24న హిందూపురంలోని ఓ లాడ్జికి తీసుకువెళ్ళాడు. గొడవ జరగడంతో ఆమె ముఖంపై దిండ్లు వేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనారోగ్యంతో చనిపోయినట్లు లాడ్జి సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించాడు. ఆ తర్వాత తప్పించుకున్నాడు. పోలీసులు ఆదివారం అతడిని అరెస్టు చేశారు. ఆధారాలు ఉన్న అతని సెల్ ఫోన్ ను సీజ్ చేశారు. నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించారు.

హిందూపురం లాడ్జిలో.. తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి...రూంలో మరొక వ్యక్తి...

టాటూలే ఆయుధం..

మహిళలను వేధించిన కేసులో జైలుశిక్ష అనుభవించిన మహేశ్ వర్మలో మార్పు రాలేదు. అమ్మాయిల వెంటపడి ప్రేమ నడిపినట్లు తెలుస్తోంది. ప్రేమించిన అమ్మాయిల పేర్లను వేయించుకోవడం... వాటిని చూపిస్తూ... మాయ మాటలు చెబుతూ... వారితో సోషల్ మీడియాలో చాటింగ్ చేసేవాడిని విచారణలో తెలిసింది. వైద్య విద్యార్థిని పేరును సైతం భుజం మీద టాటూ వేయించుకున్నాడు. ఆమె ఫోటోను వీపు మీద వేయించుకున్నట్లు గుర్తించారు. 

ఇదిలా ఉండగా, హిందూపురంలో వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసులో ఆగస్ట్ 26న షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చదువులో ఆమె ముందుండేది. ఎంబిబిఎస్ పూర్తి చేసింది. తాను కూడా వైద్యసేవలు అందించాలని అనుకుంది. ఆలోచనతోనే పిజి చేస్తోంది. ఇంతలో ఆమె కలలు కల్లలయ్యాయి. ప్రయాణంలో పరిచయమైన వ్యక్తి చేతిలో అనంత లోకాలకు పయనం అయింది. ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేటకు చెందిన వైద్య విద్యార్థిని అక్షిత (27)కు నాలుగేళ్ల కిందట రేగొండ మండలం నిజాంపల్లికు చెందిన వైద్యుడుతో పెళ్లి జరిగింది. ప్రస్తుతం అతను భూపాలపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.

వీరికి మూడేళ్ల వయసు  పాప కూడా ఉంది.  అక్షిత కర్ణాటకలోని చిక్బల్లాపూర్ లోని మెడికల్ కాలేజీలో పీజీ చేస్తోంది. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెడుతూఉంటుంది. ఐదు నెలల కిందట అలా ప్రయాణిస్తున్న క్రమంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన మహేష్ వర్మతో పరిచయం ఏర్పడింది. ఫోన్ నెంబర్, సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు  తీసుకుని ఆమెతో చాటింగ్ చేశాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అయితే ఆమె తనకు పెళ్లి అయిందని, బిడ్డ ఉందని తిరస్కరించింది. ఈ క్రమంలో అతను సోషల్ మీడియా అకౌంట్ లో ఉన్న ఆమె ఫోటోలను డౌన్లోడ్ చేసుకుని..  వాటిని మార్ఫింగ్ చేసి వేధించడం మొదలు పెట్టాడు. డబ్బులు ఇవ్వాలని,  తన వద్దకు రావాలని బెదిరించాడు. 

వరంగల్ నుంచి చిక్ బళ్లాపురం వెళ్లడానికి అక్షిత ఈ నెల 23వ తేదీ సాయంత్రం జైపూర్ ఎక్ష్ప్రెస్స్ లో బయలుదేరింది. చిక్ బళ్లాపురానికి వెళ్లడానికి 24వ తేదీ ఉదయం హిందూపురంలో దిగింది. ఆమె వెంట మహేష్ వర్మ సైతం అదే రైలులో వచ్చాడు. మాట్లాడుకుని, సెటిల్ చేసుకుందామని అతను ఆమెను హిందూపురంలోని లాడ్జీకి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో అక్షిత గొంతు పిసికి చంపేశాడు. మృతురాలి సోదరుడు శశాంక్ గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హిందూపురం పట్టణ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios