న్యాయవాద విద్య పూర్తి చేసుకున్న అనంతరం తెనాలిలో ఆయన అనేక ఏళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తెనాలి బార్ అసోసియేషన్ లో సభ్యులుగానూ కొనసాగారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావు కి పుత్ర వియోగం జరిగింది. ఆయన ఏకైక కుమారుడు యడ్లపాటి జయరాం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల తుదిశ్వాస విడిచారు. జయరాం తన తండ్రిలాగే న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఈయన సహ విద్యార్థులు. న్యాయవాద విద్య పూర్తి చేసుకున్న అనంతరం తెనాలిలో ఆయన అనేక ఏళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తెనాలి బార్ అసోసియేషన్ లో సభ్యులుగానూ కొనసాగారు. ఆయన మృతితో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాగా.. యడ్లపాటి జయరాం మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులతో ఫోన్ లో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు పలువురు టీడీపీ నేతలు కూడా సంతాపం తెలిపారు. మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, పలువురు మాజీ ఎమ్మెల్యేలు జయరాం మృతదేహం వద్ద నివాళులర్పించారు.
