మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాత్రం చంద్రబాబుకు దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. ఫించన్లు, రోడ్ల విషయాన్ని ట్వీట్ లో పెట్టిన చంద్రబాబుకు మన్మోహన్ కూడా అదే ట్వట్టర్లో సమాధానమిచ్చారు.
చంద్రబాబునాయుడుకు దిమ్మతిరిగే సమాధానమిచ్చారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. నంద్యాల ఓటర్లతో చంద్రబాబు మాట్లాడుతూ, తానేసిన రోడ్ల మీద తిరుగుతూ, తానిస్తున్న ఫించన్లు తీసుకుంటూ, రేషన్ తీసుకుంటూ తనకు ఓట్లేయరా? అంటూ నిలదీసారు. జనాలకు ఇస్తున్న ఫించన్లైనా, రేషన్ అయినా, వేస్తున్న రోడ్లైనా చంద్రబాబేమీ తన సొంత జేబులో నుండి డబ్బు ఖర్చు పెట్టటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే.
కానీ చంద్రబాబు మాత్రం సొంతడబ్బు ఖర్చు పెడుతున్న పద్దతిలోనూ మాట్లాడారు. చంద్రబాబు వైఖరితో జనాలకు మండినా ఏం మాట్లాడలేకపోయారు. కానీ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాత్రం చంద్రబాబుకు దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. ఫించన్లు, రోడ్ల విషయాన్ని ట్వీట్ లో పెట్టిన చంద్రబాబుకు మన్మోహన్ కూడా అదే ట్వట్టర్లో సమాధానమిచ్చారు. ‘తన ప్రభుత్వాన్ని జనాలు విమర్శించటాన్ని ఇష్టపడకపోతే పన్నుల వసూళ్ళను ఆపేయాల’ని హితవు పలికారు. అదే సమయంలో ‘జనాలను ఓట్లు అడుక్కోవటం కూడా మానేయాల’నిఘాటుగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
