వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పాలనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. అంతా బాగుందని అనుకోవడానికి వీలు లేదని.. నవరత్నాల్లో ఏ ఒక్కటి అమలు కాకపోయినా జగన్ చుట్టూ ఉన్నవారే తిరగబడతారని ఉండవల్లి హెచ్చరించారు.

ఆ రోజుల్లో ఎన్టీఆర్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదని కేవలం ఎమ్మెల్యేలే ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేశారని ఉండవల్లి గుర్తుచేశారు. చంద్రబాబు తిరుగుబాటు చేస్తారని ఎవరైనా ఊహించారా అని అరుణ్ కుమార్ పేర్కొన్నారు.

కాగా జగన్ 100 రోజుల పాలనపై ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పార్టీ తరపున పుస్తకాన్ని విడుదల చేసిన ఆయన వైసీపీ వంద రోజుల పాలనలో పారదర్శకత, దార్శనికత లోపించిందన్నారు.