రెచ్చగొట్టారు, నాది తప్పని నిరూపిస్తే... బొత్సకు చింతమనేని సవాల్

తన కుటుంబసభ్యులను, కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని.. ప్రస్తుతం తన భార్య హాస్పిటల్ లో ఉందని చెప్పారు. సోదాల పేరుతో పోలీసులు ఈ రోజు ఉదయం తన ఇల్లు ధ్వంసం చేశారని ఆయన మండిపడ్డారు. ఇళ్లంతా గందరగోళం సృష్టించి... భయబ్రాంతులకు గురిచేస్తే... జిల్లా అంతా అణిగిమణికి ఉంటుందనుకున్నారని.. తనను రెచ్చగొట్టారని.. తాను ఏ విచారణకైనా సిద్ధంగానే ఉన్నట్లు చెప్పారు.

ex mla chintamaneni challenge to minister botsa satyanarayana

తనపై అక్రమ కేసులు పెట్టారని టీడీపీ సీనీయర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న చింతమనేని నేడు దుగ్గిరాలలోని తన నివాసానికి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ సమయంలో చింతమనేనిని పోలీసులు అరెస్టు చేశారు. 

పోలీసుల అరెస్టు అనంతరం చింతమనేని మీడియాతో మాట్లాడారు.  తన కుటుంబసభ్యులను, కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని.. ప్రస్తుతం తన భార్య హాస్పిటల్ లో ఉందని చెప్పారు. సోదాల పేరుతో పోలీసులు ఈ రోజు ఉదయం తన ఇల్లు ధ్వంసం చేశారని ఆయన మండిపడ్డారు. ఇళ్లంతా గందరగోళం సృష్టించి... భయబ్రాంతులకు గురిచేస్తే... జిల్లా అంతా అణిగిమణికి ఉంటుందనుకున్నారని.. తనను రెచ్చగొట్టారని.. తాను ఏ విచారణకైనా సిద్ధంగానే ఉన్నట్లు చెప్పారు.

తాను తప్పు చేసినట్టు మంత్రి బొత్సా రుజువు చేస్తే.. తన తండ్రి ఆస్తి, తన ఆస్తి పేదలకు దానం చేస్తానని, లేకపోతే మంత్రి పదవికి బొత్సా రాజీనామా చేస్తారా? అంటూ చింతమనేని సవాల్ విసిరారు. తనకు మెజిస్టీరియల్‌ విచారణ అవసరం లేదన్నారు. గ్రామసభ పెట్టి.. తాను తప్పు చేశానని ఎవరైనా అంటే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మమ్మల్ని దొంగలంటున్నారు.. మరి ఆయనేమో దొరట అని ఎద్దేవా చేశారు. 

విజయసాయి మీద ఉన్నన్ని కేసులు ఎవరి మీదా లేవని చింతమనేని పేర్కొన్నారు. తాను వస్తున్నానని ముందే చెప్పానని.. అయినా తనను పట్టుకుంటున్నట్లు పోలీసులు ఓవరాక్షన్‌ చేస్తున్నారన్నారు. 12 పోలీసు బృందాలను పెట్టినా.. 14 రోజుల పాటు తనను పట్టుకోలేకపోయారని చింతమనేని అన్నారు.

"

read more news

అజ్ఞాతం వీడిన చింతమనేని: భార్యను చూసేందుకు వెళ్తుండగా అరెస్ట్

నేడు పోలీసుల ఎదుట లొంగిపోనున్న చింతమనేని ప్రభాకర్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios