తూర్పుగోదావరి జిల్లాపై జగన్‌, విజయసాయిరెడ్డి కన్నుపడిందన్నారు టీడీపీ సీనియర్ నే, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప . జిల్లాలో విజయసాయి అనుచరులు 10 వేల ఎకరాలు అరబిందో సంస్థకు ఇచ్చారని, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు వాస్తవాలు చెబుతుంటే మంత్రి కన్నబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆయన తప్పుబట్టారు.

ముఖ్యమంత్రి తప్పులను కన్నబాబు సమర్థించడం సరికాదని చినరాజప్ప హితవు పలికారు. తెలుగుదేశం హయాంలో రైతులకు అండగా నిలిచి వారి హక్కులను కాపాడామని చినరాజప్ప చెప్పారు.

Also Read:ఇవాళ్టిది కాదు... అది జగన్ 14ఏళ్ల కల: యనమల సంచలనం

కాగా, కాకినాడ సెజ్ పై జగన్మోహన్ రెడ్డి కన్నేయడం ఇవాల్టిది కాదని... కోన ప్రాంతాన్ని కబళించాలన్నది జగన్ 14ఏళ్ల కల అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ ప్రయత్నం చేయగా తెలుగుదేశం పార్టీ అడ్డుకుందని...దీంతో తమ పార్టీపై ఆయన కక్ష గట్టారని అన్నారు.

జగన్ సీఎం కాగానే మళ్లీ బినామీ సంస్థలతో కోన ప్రాంతాన్ని కైంకర్యం చేసే కుట్రలు చేస్తున్నారు. సిబిఐ ఛార్జిషీట్లలో సహ నిందితులే బినామీలుగా భూముల ఆక్రమిస్తున్నారు.  జగన్మోహన్ రెడ్డికి  విజయ సాయి రెడ్డి బినామీ అయితే ఆయనకు అల్లుడు ''అరబిందో'' రోహిత్ రెడ్డి. ఇలా ఎ1 కు బినామీ ఎ2 అయితే ఎ2కు బినామీ  అరబిందో అల్లుడు'' అంటూ యనమల సంచలన వ్యాఖ్యలు చేశారు.