వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డికి, ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పంచ్ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాసిన లేఖను రాజకీయంగా చూడటం గర్హనీయమని యనమల అన్నారు.

ప్రజా వేధిక భవనాన్ని తనకు కేటాయించాలని ఇటీవల చంద్రబాబు.. సీఎం జగన్ కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాగా... దీనిపై విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం కొ రాసే తొలి లేఖ ఇదా అంటూ ట్విట్టర్ లో విమర్శలు చేశారు. కాగా... ఆ విమర్శలకు ఈ రోజు యనమల సమాధానం చెప్పారు.

విజయసాయి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. కొత్త ప్రభుత్వానికి చంద్రబాబు రాసింది..మొదటి లేఖ కాదని.. ఈ విషయం విజయసాయిరెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. సమగ్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని గతంలోనే చంద్రబాబు జగన్‌కు లేఖ రాశారని యనమల గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చినా.. వైసీపీ నేతలు అబద్ధాలు మానడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. విలాసవంతమైన భవనాలు ఊరికొకటి చొప్పున.. ఎవరికి ఉన్నాయో అందరికీ తెలిసిందేనని యనమల అన్నారు.