ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి  యనమల రామకృష్ణుడు విమర్శలు చేశారు. జగన్  ప్రజలను కేవలం ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారని గుర్తు చేశారు. రాష్ట్రంలో నిధులు ఉన్నాయో లేదో చూసుకోకుండానే హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు.

ప్రత్యేక హోదాపై గతంలో అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానాలు చేశామని, శాసనసభ తీర్మానాలను కేంద్రం పట్టించుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు చివరి రోజు సమావేశంలో భాగంగా శాసనమండలిలో ఆయన మాట్లాడారు.
 
జగన్ హామీల్లో కొత్త పథకాలు నెరవేర్చడానికి పాత పథకాలు రద్దు చేస్తున్నారన్నారని యనమల ఆరోపించారు. నిధుల వెసులుబాటు చూసుకోకుండా హామీలు ఇచ్చారని విమర్శించారు. రూ.43 వేల కోట్లు ఎక్కడ నుంచి వస్తాయో చూసుకోవాలని ఆయన అన్నారు.