Asianet News TeluguAsianet News Telugu

ట్విట్టర్ తేరగా దొరికిందని కారుకూతలు, బాబు గారు.. లోకేశ్‌ను అదుపులో పెట్టండి : పేర్ని నాని

లోకేష్‌ను అదుపులో పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు మాజీ మంత్రి పేర్ని నాని. లోకేష్‌కు ట్విట్టర్ తేరగా దొరికిందని.. తద్వారా ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు చేస్తున్నారని ఆయన సెటైర్లు వేశారు. 

ex minister perni nani slams tdp chief chandrababu naidu
Author
First Published Sep 8, 2022, 6:55 PM IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేశ్‌లపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి పేర్ని నాని. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్‌ను చంద్రబాబు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. కొడుకును కట్టడి చేయకపోతే సభ్యతగా వుండదని.. సమాజం కూడా హర్షించదని పేర్ని నాని ఎద్దేవా చేశారు. లోకేష్‌కు ట్విట్టర్ తేరగా దొరికిందని.. తద్వారా ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు చేస్తున్నారని ఆయన సెటైర్లు వేశారు. 

లోకేశ్‌కు అసలు మంత్రి పదవి ఎలా వచ్చింది.. ఆయన కోసం ఐదుగురు మంత్రులను తొలగించారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. దోచుకోవడం, దాచుకోవడం అన్నట్లుగా చంద్రబాబు పాలన సాగిందని ఆయన ఆరోపించారు. 600 హామీలిచ్చి నెరవేర్చకపోతే ఎల్లో మీడియా ఎందుకు ప్రశ్నించలేదని పేర్ని నాని నిలదీశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది చంద్రబాబు కాదా .. రైతులకు బకాయిలు చెల్లించకుండా ఎగ్గొట్టారని మాజీ మంత్రి ఆరోపించారు. ఆర్ధిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని పేర్ని నాని స్పష్టం చేశారు. 

ALso REad:ధైర్యంగా వుండండి.. అండగా వుంటాం : చెన్నుపాటి గాంధీని పరామర్శించిన నారా లోకేష్

అంతకుముందు మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో దళితులపై జరుగుతోన్న దాడులు చాలా ఉన్నాయని... లోకేష్ ఇప్పుడిప్పుడే పరామర్శలు నేర్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మేం దళిత వ్యతిరేకులమా, దళితులతో వియ్యం అందుకున్న చరిత్ర వైఎస్ జగన్‌దన్నారు. జగన్ పాలన దళిత సంక్షేమాన్ని కోరేదని.. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం లేదని రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని లోకేష్ కామెంట్స్ చేస్తున్నారని ఫైరయ్యారు. అరేయ్ లోకేష్.. నువ్వు మమ్మల్ని.. మా నాయకుడిని బూతులు తిడతావా అంటూ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాజారెడ్డి దేశానికి, రాష్ట్రానికి ఆణిముత్యాల్లాంటి నేతలను అందించారని.. చంద్రబాబు నీలాంటి పప్పు ముద్దలను అందించలేదని మంత్రి చురకలు వేశారు. చంద్రబాబు హయాంలో మహిళలను వివస్త్రలను చేసిన విషయం మరిచారా అంటూ నాగార్జున ప్రశ్నించారు. రాజధానిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని కోర్టుకెళ్లిన చరిత్ర చంద్రబాబుదని, వారికి ఇళ్ల పట్టాలిస్తే సామాజిక సమత్యులత దెబ్బతింటుందంటారా అని ఆయన నిలదీశారు. చంద్రబాబు రాజకీయ సమాధి అయ్యారని.. తండ్రీకొడుకులు దళితుల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించడమేనని నాగార్జున దుయ్యబట్టారు. జాతీయ కమిషన్ ఏమైనా దేవుళ్లా..? వాళ్లు వచ్చి ఏపీలో పరిస్థితులేంటో తెలుసుకోవాలని ఆయన సూచించారు. లోకేష్ నోటి వెంట బూతు మాట వస్తే నాలిక కోస్తామని.. వార్డు కౌన్సిలర్ కాలేని లోకేష్ మా గురించి మాట్లాడతారా అని మేరుగు నాగార్జున ఫైరయ్యారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios