ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జోస్యం చెప్పారు.  ఇటీవల ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా..ఏపీ ప్రజల చూపు జనసేన వైపు ఉందని బాలరాజు అభిప్రాయపడ్డారు. ఆదివారం అచ్యుతాపురంలో పార్టీ నియోజక వర్గం సెంట్రల్‌ కార్యాల యాన్ని ఆయన ప్రారంభిం చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రలో ప్రస్తుతం పవన్‌గాలి వీస్తోందన్నారు.
 
ప్రధానంగా యువ కులు పార్టీకి వెన్నెముకలా ఉంటూ విస్తృతంగా కార్యక్రమాల్లో పాల్గొంటు న్నారన్నారు. రాష్ట్రమంతా పార్టీకి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ప్రతి గ్రామంలో పర్యటించి పార్టీ ప్రతిష్టకు నియోజక వర్గస్థాయి నాయ కులు కృషిచేయాల న్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కొందరు నాయకులు బాలరాజు సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ.. బాలరాజు.. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.