అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా యుద్ధానికి కాళ్లు దువ్వుతున్నారు మాజీమంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారని కానీ ఈ రోజు ప్రత్యేక హోదా ఊసే లేదని విమనర్శించారు. 

ప్రత్యేక హోదా విషయంలో ఏది మీ పోరాటం?.. ఏది మీ మడమ తిప్పని నైజం? కాళ్లకు సాష్టాంగ పడటం.. భజన చేయడమే పోరాటమా? అంటూ నిలదీశారు. ఏపీ ప్రయోజనాలను మీరేం చేయదల్చుకున్నారో చెప్పండి? అంటూ నిలదీశారు. 
 
గతంలో కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మెుండి చేయిచూపిస్తే నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు నాయుడుని రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన జగన్ ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసుల భయంతో జగన్ కేంద్రానికి దాసోహం అయ్యారని విమర్శించారు.  

కేసల భయంతో సీఎం జగన్  కేంద్రానికి దాసోహం అయ్యి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రప్రయోజనాలను కేంద్రానికి తాకట్టుపెట్టే హక్కు మీకెక్కడిది అంటూ నారా లోకేష్ సీఎం జగన్ ను విమర్శించారు.