అమరావతి: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై వినూత్న రీతిలో స్పందించారు మాజీమంత్రి నారా లోకేష్. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మెుండి చేయి చూపడానికి సీఎం వైయస్ జగన్ వ్యవహార శైలియే కారణమంటూ ట్వీట్ చేశారు. 

కేసుల మాఫీ కోసం సీఎం వైయస్ జగన్ మోదీకి సాష్టాంగ పడ్డారని ఆరోపించారు. ఫలితంగా ఏపీకి  రావాల్సిన నిధులు, హక్కులు గాలికొదిలారని విమర్శించారు. రాష్ట్రంలో 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాం అన్న వైయస్ జగన్ కేంద్రం ముందు సాష్టాంగపడి ఏపీ ప్రజల మెడలు వంచారని ఘాటుగా విమర్శించారు. 

రాష్ట్రప్రజలు వైయస్ జగన్ కు 22 మంది ఎంపీలను గెలిపించి ఇస్తే జగన్ కేంద్రం నుంచి సాధించింది ఏమీ లేదని విమర్శించారు. 22 మంది ఎంపీలను ఇచ్చినందుకు కేంద్రం నుంచి జీరో బేస్డ్ న్యాచురల్ బడ్జెట్ సాధించారంటూ జగన్ పై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.