కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు.

ఆయన మరణంతో నరసింహారావు స్వస్థలం మచిలీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మామగారే నరసింహారావు . 1999లో నడకుదిటి నరసింహారావు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై .. చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు.

2004 అసెంబ్లీ ఎన్నికల్లో నడకుదిటి నరసింహారావుపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పేర్ని నాని గెలుపొందారు. ఆయన మరణంపై టీడీపీ నేతలు, పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.