సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం 59వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని ఇప్పటికే ఆయన అభిమానులు వేడుకలు జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా... తాజాగా బాలయ్య పెద్ద అల్లుడు, ఏపీ మాజీ మంత్రి లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా విషెస్ తెలియజేశారు.

‘‘తన నటచతురతతో కోట్లాది ప్రజల అభిమానం సంపాదించిన కళాకారుడిగా,  నిరంతరం ప్రజా సంక్షేమమే పరమావధిగా, ప్రజలకోసం పనిచేస్తున్న మా బాలా మావయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు.’’ అంటూ లోకేష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.