తాను ప్రస్తుతం ఏరాజకీయ పార్టీలో లేనని మాజీ మంత్రి కొణతల రామకృష్ణ తెలిపారు. కాకపోతే.. తమ పార్టీలో చేరండి అంటూ.. తనకు అన్ని పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలను ఏవీ అమలు చేయలేదని మండిపడ్డారు.  రాష్ట్రానికి ఇచ్చిన నిధులను కేంద్రం వెనక్కి తీసుకోవడం దారుణమన్నారు. ఏపీ మీద కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు.

ఏపీకి న్యాయం చేయాలంటూ ఈ నెల 27న విశాఖలో రైల్ యాత్ర చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షను తెలియజేయడానికే ఈ రైల్ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఢిల్లీ యాత్ర ముగిసిన తర్వాత కార్యకర్తలతో చర్చించి ఏ పార్టీలో చేరే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు కొణతల వెల్లడించారు.