20 శాతం ఓటింగ్ వుంటే 24 సీట్లా.. కాపు సామాజికవర్గం చేతుల్లో చంద్రబాబుకు షాక్ తప్పదు : కొడాలి నాని
టీడీపీ జనసేనలు తాడేపల్లి గూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. కాపు సామాజిక వర్గం చంద్రబాబుకి బుద్ధి చెబుతుందని.. ఏం చేస్తారో చెప్పకుండా చంద్రబాబు, పవన్ జెండా సభలు పెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు.
టీడీపీ జనసేనలు తాడేపల్లి గూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ను నాశనం చేస్తున్న చంద్రబాబును 80 లక్షల పాదాలు తిరిగి లేవకుండా పాతాళానికి తొక్కుతాయన్నారు. కాపు సామాజిక వర్గం చంద్రబాబుకి బుద్ధి చెబుతుందని.. ఏం చేస్తారో చెప్పకుండా చంద్రబాబు, పవన్ జెండా సభలు పెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ .. జగన్‌ను పవన్ కళ్యాణ్ దారుణంగా తిడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు. చేసిన మంచిని ప్రజలకు చెబుతూ.. 175 స్థానాల్లో అభ్యర్ధులను నిలుపుతున్నారని మాజీ మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి 21 సీట్లు ప్రకటించారని.. మరో 10 స్థానాలు ఇస్తారని కొడాలి నాని దుయ్యబట్టారు. 3 శాతం ఓటింగ్ ఉన్న వర్గానికి 31 సీట్లు ఇస్తే.. 20 శాతం ఓటింగ్ వుందన్న జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలని కొడాలి నాని ప్రశ్నించారు. 24 సీట్లతో తాము సంతృప్తిగా లేమని జనసైనికులు బహిరంగంగా చెబుతున్నారని , చంద్రబాబు - పవన్ కళ్యాణ్ చేతిలో మోసపోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని నాని వ్యాఖ్యానించారు.