అమరావతి: భవిష్యత్  రాజకీయ జీవితంపై మాజీమంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇకపై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యబోనని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించిన ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. 

కైకలూరు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్రానికి తన పరిధిలో ఎంతో న్యాయం చేశానని తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆశీస్సులతో టికెట్ పొందినట్లు తెలిపారు. పొత్తుల్లో భాగంగా కైకలూరు నియోజకవర్గం తనకు ఇచ్చారని అందరి సహకారంతో గెలుపొందానని తెలిపారు. 

అయితే తన ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాను మళ్లీ పోటీ చెయ్యనని నాతరపున హామీ ఇచ్చారని అందువల్ల తాను ఇకపై అసెంబ్లీకి పోటీ చెయ్యడం లేదన్నారు. 

తాను మంత్రిగా పనిచేసిన సమయంలో అందరితో కలుపుకుని పోయానని తెలిపారు. తనకు తెలియకుండా ఎవరైనా తన వల్ల ఇబ్బందులు కలిగితే మన్నించాలని కోరారు. అలాగే ప్రతీ సభ్యుడికి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శుభాబినందనలు తెలిపారు. తాను అసెంబ్లీకి మాత్రమే పోటీ చెయ్యడం లేదని కానీ రాజకీయాల్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశారు.