టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేసి తరువాత బీజేపీలోకి చేరిన ఓ నేత మళ్లీ సొంత గూటికి రావాలని చూస్తున్నారు. 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఈ సారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని చూస్తున్నారు.
ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. నాయకులు కూడా తమకు అనుకూలమైన పార్టీలోకి మారిపోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏ పార్టీలో చేరితో తమకు టికెట్ దక్కుతుందో ? ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపొందే అవకాశాలు ఉంటాయో బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారిపోతున్నారు.
అధికార వైసీపీ నుంచి ప్రతిపక్ష టీడీపీలోకి కొందరు నాయకులు చేరుతుండగా.. మరొ కొందరు నాయకులు ప్రతిపక్ష పార్టీని వదిలి అధికార పార్టీ తీర్థం పుచుకుంటున్నారు. ఇంకా కొందరు నాయకులు ఈ రెండు పార్టీలను వదిలి బీజేపీ కండువా కప్పుకుంటుండగా.. మరి కొందరు కాషాయ పార్టీ నుంచి టీడీపీ, వైసీపీలోకి చేరుతున్నారు. కొంత కాలం కిందట సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ టీడీపీలోకి చేరిన సంగతి తెలిసిందే.
వాహనంపై నుంచి జారిపడ్డ జనరేటర్.. ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి.. 11 మందికి గాయాలు..
ఇదే దారిలో మరి కొందరు నేతలు టీడీపీలోకి చేరుతారని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. గతంలో తను ఎమ్మెల్యేగా పోటీ చేసి స్థానం, లేకపోతే మరో చోటు నుంచైనా అసెంబ్లీ బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నారని సమాచారం.
ఆది నారాయణరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. కాంగ్రెస్ పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మంచి విధేయుడిగా ఉన్నారని పేరుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరారు. 2014లో వచ్చిన ఎన్నికల్లో ఆ పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. కానీ కొంత కాలం తరువాత ఆయన అప్పటి అధికార పార్టీ టీడీపీలోకి చేరారు.
నెల్లూరు తోడేరు చెరువులో పడవ బోల్తా.. ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో, ఇద్దరి మృతదేహాలు లభ్యం..
కడప జిల్లాలో టీడీపీ బలం పెంచుకోవాలనే ఉద్దేశంతో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో ఆదినారాయణ రెడ్డి ఉత్సాహంగా పని చేసి టీడీపీని విస్తరించడానికి ప్రయత్నించారు. కానీ 2019 వచ్చిన ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేయకుండా లోక్ సభకు పోటీ చేశారు. కానీ ఘోరంగా ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కూడా విజయం సాధించకపోవడం, ప్రతిపక్ష పార్టీగా నిలవడం, వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఆరోపణలు రావడంతో ఆయన పార్టీని వీడారు. బీజేపీ కండువా కప్పుకున్నారు.
వైసీపీ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో తనకు ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే ఆయన జాతీయ పార్టీలో చేరానని అప్పట్లో టాక్ వినిపించింది. ఇదే సమయంలో ఆదినారాయణ రెడ్డి చేతిలో గతంలో మూడు సార్లు ఓడిపోయిన రామసుబ్బారెడ్డి టీడీపీ నుంచి అధికార వైసీపీలో చేరారు.
అయితే రాజకీయాల్లో సీనియర్ లీడర్ గా ఉన్న ఆదినారాయణ రెడ్డికి కాషాయ పార్టీలో సరైన గౌరవం లభించడం లేదని మొదటి నుంచి చర్చ జరిగింది. అలాగే రాయలసీమలో బీజేపీ ఇంకా బలం పుంజుకోకపోవడంతో ఆయన ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలుపొందడం కష్టమనే భావనతో తిరిగి టీడీపీలోకి చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. వచ్చే నెల చివరిలో చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిల్ పార్టీలోకి వెళ్లాలని భావిస్తున్నారట. ఈ విషయంలో తన అనుచరులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప.. టీడీపీకి బతకదని వాళ్లకు అర్థమైంది: మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరినప్పటికీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా లేదా అనేది అనుమానమే. దీనికి కారణం లేకపోలేదు. ఆది సైకిల్ పార్టీని వీడి బీజేపీకిలోకి చేరినా.. ఆయన సోదరుడు అదే పార్టీకి విధేయుడిగా ఉన్నారు. దీంతో పాటు సోదరుడి కుమారుడైన భూపేష్ తెలుగుదేశం పార్టీ జమ్మలమడుగు బాధ్యుడిగా ఉన్నారు. ఆయన తనకు టికెట్ వస్తుందనే నమ్మకంతో జనాలతో మమేకం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదినారాయణ రెడ్డికి జమ్మలమడుగు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదు. అయితే అది కాకపోతే పొద్దుటూరు స్థానాన్ని తనకు కేటాయించాలని ఆయన కోరుతారని తెలుస్తోంది. ఈ విషయాన్ని సైకిల్ పార్టీ హైకమాండ్ కు కూడా తెలియజేశారని సమాచారం. కానీ ఆ స్థానం కోసం ఎప్పటికే స్థానిక సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. వారి మధ్యనే గొడవలు జరుతున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఆయన టీడీపీలోకి చేరి, ఆ స్థానాన్ని కోరితే ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.
