ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామ శివారు వద్ద బొలెరో వాహనం మీద నుంచి జనరేటర్ జారిపడగా దానిని ఆటో ఢీకొట్టింది.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామ శివారు వద్ద బొలెరో వాహనం మీద నుంచి జనరేటర్ జారిపడగా దానిని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో 11 మందికి గాయాలు అయ్యాయి. వివరాలు.. బొలెరో వాహనంలో జనరేటర్‌ను తీసుకుని వెళ్తుండగా.. దానికి కట్టిన తాడు తెగిపోవడంతో రోడ్డు మీద పడిపోయింది. అయితే వెనకాల నుంచి వచ్చిన ఆటో.. జనరేటర్‌ను ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో 11 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.