తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు అరెస్ట్ ప్రభావం తప్పదు : గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ప్రభావం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఖచ్చితంగా వుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి అన్ని పార్టీలు ఓ లక్ష్యంతో పనిచేస్తాయని ఆయన అన్నారు.

ex minister ganta srinivasa rao sensational comments on telangana assembly elections ksp

వైసీపీ నేతలపై మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అధిష్టానం ఏం చెబితే పురందేశ్వరి అది చేస్తారని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ప్రభావం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఖచ్చితంగా వుంటుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, సీపీఐ కలిసి ముందుకు సాగుతాయని.. బీజేపీ తమ కూటమితో వస్తుందో రాదో అన్నది కాలమే నిర్ణయిస్తుందని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. 

వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి అన్ని పార్టీలు ఓ లక్ష్యంతో పనిచేస్తాయని ఆయన అన్నారు. దసరా నాటికి జగన్ విశాఖ వస్తారంటూ ప్రభుత్వం ఓ దొంగ జీవో విడుదల చేసిందని గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలోనే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గుర్తుకురావడం హాస్యాస్పదంగా వుందన్నారు. 

అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇంచార్జీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. టిడిపి, జనసేన పొత్తుపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న వైసిపి నాయకులు గత ఎన్నికల్లో ఏం చేసారో గుర్తుచేసుకోవాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తో జగన్ కలవలేదా..? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అయినా సింగిల్ గానే ఎన్నికలకు వెళ్లి గెలుస్తామంటున్న వైసిపి నాయకులు టిడిపి, జనసేన కలిస్తే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని వెంకన్న నిలదీసారు. 

Also Read: అమిత్ షా కలవాలనుకుంటున్నట్లు కిషన్‌రెడ్డి ఫోన్.. ఆ విషయం స్పష్టం చేశారు: లోకేష్ కీలక వ్యాఖ్యలు

కుటుంబ విలువల గురించి ఎన్టీఆర్ బిడ్డలకు బాగా తెలుసు... అందువల్లే లోకేష్ ను పురంధేశ్వరి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరకు తీసుకెళ్లిందని వెంకన్న అన్నారు. చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత విచారణ పేరిట లోకేష్ ను ఇబ్బందిపెట్టడం పురంధేశ్వరి గమనిస్తూ వున్నారన్నారు. అలాగే తన సోదరి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిని కూడా ఇబ్బందులు పెట్టడం చూసి సహించలేకే అమిత్ షా వద్దకు లోకేష్ ను దగ్గరుండి తీసుకెళ్లారని  అన్నారు. ఇలా సోదరి కుటుంబం ఇబ్బందుల్లో వుంటే చూడలేక సాయానికి ముందుకు వచ్చిన పురంధేశ్వరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నానని వెంకన్న అన్నారు. 

ఇక రాజకీయ కక్షతో సీఎం జగన్ ఎలా ఇబ్బంది పెడుతున్నారో లోకేష్ కేంద్ర హోమంత్రికి తెలిపారని బుద్దా వెల్లడించారు. ఇదే క్రమంలో ఏపీలో జగన్ సర్కార్ కనుసన్నల్లో కొనసాగుతున్న లిక్కర్ స్కాం గురించి అమిత్ షా కు పురంధేశ్వరి వివరించారని తెలిపారు. కేంద్రం ప్రభుత్వం ఏపీలో సాగుతున్న ప్రజాధనం దోపిడీపై దృష్టిసారించాలని కేంద్ర మంత్రిని పురంధేశ్వరి కోరినట్లు వెంకన్న వెల్లడించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios