టీడీపీ తరపున..ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ కి అభినందనలు తెలపడానికి రెండు రోజులపాటు ప్రయత్నించామని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. కానీ... జగన్ తమకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని ఆయన చెప్పారు.  గంటా శ్రీనివాసరావు తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ  సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ని స్వయంగా కలిసి శుభాకాంక్షలు చెబుతామని నాతో పార్టీ మా పార్టీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు  ప్రయత్నించాం కానీ కుదరలేదని చెప్పారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్ చేసి వ్యాఖ్యలు సమంజసంగా లేవని ఆయన అన్నారు.

వృద్ధుల పింఛన్లు రూ.3వేలకు పెంచుతామని చెప్పి.. కేవలం రూ.250 పెంచి రూ.2,250కి పరిమితం చేశారు. మద్యపాన నిషేధం విషయంలోనూ మాట దాటవేస్తూ దశలవారీగా అమలుచేసి ఆఖరుగా హోటళ్లలో విక్రయిస్తామని అంటున్నార’ని వ్యాఖ్యానించారు.