చంద్రబాబు, రాహుల్ గాంధీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ నేత సీ. రామచంద్రయ్య. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన ఇవాళ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజకీయాలు తెలియవని అన్నారు.. తల్లి కాంగ్రెస్ కాళ్లు పట్టుకుని... దేశంలో చక్రం తిప్పుతానని చంద్రబాబు కలలు కంటున్నారని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు.

చంద్రబాబు పెంచి పోషిస్తున్న అరాచక శక్తులను అంత మొందించాల్సిన అవసరం ఉందని.. ఈ అక్రమాలను అరికట్టే సమర్థత జగన్‌కు ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబుని విమర్శించారు.

గవర్నర్ వ్యవస్థను కూడా బాబు నాశనం చేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఏ భావాలతో టీడీపీ పెట్టారో అది ఇప్పుడు లేదన్నారు.. త్వరలో మరింత మంది కాంగ్రెస్ నేతలు వైఎస్సార్‌సీపీలోకి వస్తారని రామచంద్రయ్య ఆశాశభావం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ కి షాక్.. వైసీపీ కండువా కప్పుకున్న మాజీ మంత్రి