ఒంగోలులోని బార్ సిండికేట్లతో తనకు సంబంధం వున్నట్లుగా జనసేన నేతలు చేస్తోన్న ప్రచారంపై స్పందించారు మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి. జనసేన నాయకులు తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఒంగోలులో ఎవరు సిండికేట్ అయ్యారో పవన్ చెప్పాలని బాలినేని సవాల్ విసిరారు.
ఒంగోలులో బార్ల సిండికేట్లతో తనకు సంబంధం లేదన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి. సిండికేట్ అయిన విషయం తెలియగానే ఈ - వేలం రద్దు చేయాలనపి కలెక్టర్‌కు చెప్పానని బాలినేని గుర్తుచేశారు. జనసేన నాయకులు తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఒంగోలులో ఎవరు సిండికేట్ అయ్యారో పవన్ చెప్పాలని బాలినేని సవాల్ విసిరారు.
ఇకపోతే.. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నారని గత మూడు నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన జనసేనలోకి వెళ్లనున్నారని.. అందుకే ట్విట్టర్‌లో చేనేత సంబంధించి పవన్ కల్యాణ్ చేసిన చాలెంజ్‌ను బాలినేని స్వీకరించారని ఆ ప్రచారం సారాంశం. దీంతో ఈ విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై బాలినేని శ్రీనివాస రెడ్డి కొద్దిరోజుల క్రితం స్పందించారు. తాను జనసేన నేతలతో టచ్‌లో ఉన్నాననే ప్రచారం అవాస్తవమని వెల్లడించారు.
Also REad:బాలినేని జనసేన వైపు చూస్తున్నారా?.. ఆ ట్వీట్‌తో మొదలైన ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి..
ఊసరవెల్లి రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. వైఎస్సార్ రాజకీయ బిక్షతో ఎమ్మెల్యేను అయ్యానని చెప్పారు. ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే ఉంటానని తెలిపారు. రాజకీయాల్లో ఉంటే వైసీపీలోనే ఉంటా.. లేకుండా రాజకీయాలు మానేస్తానని బాలినేని చెప్పారు. పవన్ చేనేతకు సంబంధించి తనను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తే రెస్పాండ్ అయ్యానని చెప్పారు. పవన్‌కు కేటీఆర్ కూడా ట్యాగ్ చేశారని.. దాన్ని హైలెట్ చేయరని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వైసీపీ కార్యకర్తలు కోసం ఎంత వరకైనా పోరాడుతాని స్పష్టం చేశారు. కొందరు తనను కావాలని రెచ్చగోడుతున్నారని మండిపడ్డారు.
