Asianet News TeluguAsianet News Telugu

బాలినేని జనసేన వైపు చూస్తున్నారా?.. ఆ ట్వీట్‌తో మొదలైన ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి..

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీఎం జగన్ బంధువు బాలినేని శ్రీనివాస‌రెడ్డి పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నారని గత మూడు నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ ప్రచారంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి  స్పందించారు. 

balineni srinivasa reddy says his not in touch with janasena
Author
First Published Aug 10, 2022, 10:53 AM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీఎం జగన్ బంధువు బాలినేని శ్రీనివాస‌రెడ్డి పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నారని గత మూడు నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన జనసేనలోకి వెళ్లనున్నారని.. అందుకే ట్విట్టర్‌లో చేనేత సంబంధించి  పవన్ కల్యాణ్‌ చేసిన చాలెంజ్‌ను బాలినేని స్వీకరించారని ఆ ప్రాచారం సారాంశం. దీంతో ఈ విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా ఆ ప్రచారంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి  స్పందించారు. తాను జనసేన నేతలతో టచ్‌లో ఉన్నాననే ప్రచారం అవాస్తవమని వెల్లడించారు. 

బుధవారం బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. ఊసరవెల్లి రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. వైఎస్సార్ రాజకీయ బిక్షతో ఎమ్మెల్యేను అయ్యానని చెప్పారు. ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే ఉంటానని తెలిపారు.  రాజకీయాల్లో ఉంటే వైసీపీలోనే ఉంటా.. లేకుండా రాజకీయాలు మానేస్తానని చెప్పారు. పవన్ చేనేతకు సంబంధించి తనను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తే రెస్పాండ్ అయ్యానని చెప్పాు. పవన్‌కు కేటీఆర్ కూడా ట్యాగ్ చేశారని.. దాన్ని హైలెట్ చేయరని అన్నారు. వైసీపీ కార్యకర్తలు కోసం ఎంత వరకైనా పోరాడుతాని స్పష్టం చేశారు. కొందరు తనను కావాలని రెచ్చగోడుతున్నారని మండిపడ్డారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో విచారణ జరుగుతోందని చెప్పారు. 

ఇక, కొన్ని నెలల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు మరోమారు మంత్రిగా అవకాశం దక్కుతుందని బాలినేని శ్రీనివాస రెడ్డి భావించారు. అయితే తనకు మరోసారి మంత్రిగా అవకాశం లభించకపోవడంతో ఆయన అసంతృప్తి చెందారు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు వైసీపీ అధిష్టానం అనేక ప్రయత్నాలు చేయాల్సి ఉంది. చివరకు జగన్‌తో భేటీ తర్వాత బాలినేని అలక వీడారు. అయితే  కొద్ది రోజులుగా జిల్లాలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై బాలినేని అసంతృప్తి ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. 

ఈ క్రమంలోనే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా.. ట్విట్టర్‌లో చేనేత దస్తులు ధరించిన ఫొటోను షేర్ చేయాలనే చాలెంజ్ కొనసాగింది. కేటీఆర్‌ నుంచి ఈ చాలెంజన్‌ను స్వీకరించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. చంద్రబాబు నాయుడు, బాలినేని శ్రీనివాసరెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌లను నామినేట్ చేశారు. అయితే పవన్ చేసిన చాలెంజ్‌ను స్వీకరించిన బాలినేని.. చేనేత వస్త్రాలు ధరించిన ఫోటను షేర్ చేశారు. ‘‘ట్విట్టర్ వేదికగా చేనేత దినోత్సవం సందర్బంగా చేనేత దుస్తులు ధరించి ఫొటోలు దిగాలంటూ పవన్‌కళ్యాణ్‌ చేసిన చేనేత సవాల్ ను స్వీకరించాను. నేను వైఎస్సార్ హయాంలో చిత్తశుద్ధితో చేనేతమంత్రిగా  పని చేశాను. ఆనాడు YSR గారు 300కోట్ల రూపాయల చేనేతల కోసం రుణమాఫీ చేశారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో వైఎస్సార్ నేతన్న నేస్తంతో పాటు ఎన్నో పథకాలు అందిస్తున్నాం’’అని పేర్కొన్నారు. 

అయితే బాలినేని శ్రీనివాసరెడ్డిని పవన్ నామినేట్ చేయడం.. ఆయన వెంటనే ఆ చాలెంజ్‌ను స్వీకరించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెరవెనక ఏదో జరుగుతుందని.. బాలినేని ఆయన అనుచరులతో భేటీ అయ్యారనే ప్రచారం సాగింది. బాలినేని పార్టీలో మారాలనే ఆలోచనలో ఉన్నారని.. అందుకే కొంతకాలంగా పవన్ విషయంలో సన్నిహితంగా ఉంటారనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. మరోవైపు వైసీపీపై అసంతృప్తితో ఉన్న బాలినేని.. పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకే ఈ వ్యుహాం అవలంభిస్తున్నారనే ప్రచారం కూడా సాగింది. ఈ నేపథ్యంలో స్పందించిన బాలినేని.. తాను జనసేన నేతలతో టచ్‌లో ఉన్నాననే ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios