Asianet News TeluguAsianet News Telugu

డిజిపి గారు... ఈ 25 ప్రశ్నలకు మీ సమాధానమేంటి..: మాజీ హోమంత్రి బహిరంగ లేఖ

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టార్గెట్ గా చేసుకుని ఇటీవల ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ పేరుతో ఇటీవల ఓ ప్రకటన వెలువడినట్లు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గుర్తుచేశారు. 

ex home minister nimmakayala chinarajappa open letter AP DGP
Author
Amaravathi, First Published Aug 14, 2020, 6:55 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టార్గెట్ గా చేసుకుని ఇటీవల ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ పేరుతో ఇటీవల ఓ ప్రకటన వెలువడినట్లు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గుర్తుచేశారు. ఈ క్రమంలోనే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల పోలీస్ వ్యవస్థ ఎలా అప్రతిష్ట పాలవుతుందో తెలియజేస్తూ డిజిపికి కొన్ని ప్రశ్నలు సంధించారు మాజీ హోంమంత్రి. 

డిజిపికి చినరాజప్ప రాసిన లేఖ యధావిధిగా... 

తేది : 14.08.2020.

గౌరవ ఏపీ డీజీపీ గారికి,  

ఏపీ డీజీపీ గారి ప్రకటనను పౌరసంబంధాల శాఖ 13.08.2020న విడుదల చేసింది. అందులో మాజీ ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థపై నిరాధార ఆరోపణలు చేసినట్టు పేర్కొన్నారు. ఇది మాజీ ముఖ్యమంత్రి గారి ప్రకటనల్ని వక్రీకరించడంగా వున్నది. మాజీ సీయం ఏనాడూ ఏపీ పోలీస్‌ వ్యవస్థను తక్కువచేసి మాట్లాడలేదు. పోలీసు వ్యవస్థలో వున్న కొందరు అధికాయి అధికార పార్టీకి కార్యకర్తలుగా పనిచేస్తూ బాధితులపైనే ఎదురు కేసు పెడుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. దోషులైన అధికార పార్టీ నేతలపై కేసు నమోదు చేయడం లేదు. టీడీపీ నేతలపై, ప్రతిపక్షాలు మీడియాపై అక్రమ కేసు పెడుతున్నారని మాజీ సీయంగారు డీజీపీ గారికి అనేక లేఖలు వ్రాశారు. ఇది వాస్తవం కాదా? పోలీస్‌ వ్యవస్థకు అత్యంత గౌరవం ఇచ్చింది మాజీ సీయం అనేది బహిరంగ రహస్యం. 

పోలీస్‌ వ్యవస్థకు అధునాతన సాంకేతికతను సమకూర్చింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. పోలీస్‌ వ్యవస్థ గౌరవాన్ని పెంచడానికి బాడీ కెమెరాలు కూడా సమకూర్చింది గత ప్రభుత్వమే. పోలీస్‌ వ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చింది ఎన్‌టిఆర్‌, చంద్రబాబు ప్రభుత్వాలే. ఈ చర్యల వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి కూడా అనేక అవార్డు వచ్చాయి.
 జగన్‌రెడ్డి ప్రభుత్వ కక్షసాధింపు విధానాల వల్ల చట్టాలు, కోర్టు, రాజ్యాంగమంటే లెక్కలేని విధానా వల్ల పోలీసు వ్యవస్థ ఉన్నత న్యాయస్థానాల్లో చేతులు కట్టుకోవాల్సి వచ్చింది. పోలీస్‌ వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చింది జగన్‌రెడ్డే కానీ చంద్రబాబు కాదు అని డీజీపీ గారు గుర్తించాలి. ఈ క్రింది అంశాపై ఆలోచించి సరిచేసుకొని గత ప్రతిష్టను తిరిగి పొందుతారని ఆశిస్తున్నాను.

1. అనుమతి తీసుకొని విశాఖ వెళ్లిన మాజీ సీయంను అడ్డుకోవడానికి ఎయిర్‌పోర్టుకు వందమంది వైసీపీ బం చేరుకోవడం పోలీసు వైఫ్యం కాదా? టీడీపీ కార్యకర్తల్ని కట్టడి చేయగలిగిన పోలీసు వైసీపీ గూండాను ఎందుకు కట్టడి చేయలేకపోయారు? ఇది పోలీసు వైఫ్యం కాదా? చట్ట ప్రకారం నడుచుకొన్నారా? అధికార పార్టీకి తలొగ్గారా? ఈ ఘటన డీజీపీ గారిని ఉన్నత న్యాయస్థానం ముందు నిబెట్టలేదా?

2. గత ప్రభుత్వ కాలంలో ఉపయోగించిన బాడీ కెమెరాలు ఈ ప్రభుత్వంలో ఎందుకు తీసివేశారు? బాడీ కెమెరాలు వుంటే శిరోముండనం జరిగేదా? కిరణ్‌కుమార్‌ హత్య జరిగేదా? డా॥ సుధాకర్‌పై అమానుష చర్యు జరిగేవా? బాడీ కెమెరాలు తీసివేయడం అధికార పార్టీ ఒత్తిడి కాదా?

3. హైదరాబాద్‌లో వున్న దళిత యువకుడు విక్రమ్‌ను పోలీసు అధికారులు పిలిపించారు. అతనికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసుకు లేదా? విక్రమ్‌ హత్యను ప్రేరేపించిన గురజా ఎమ్మెల్యేపై ఎందుకు కేసు రిజిష్టర్‌ చేయలేదు?

4. మోకా భాస్కరరావు హత్య వ్యక్తిగత తగాదా వల్ల జరిగిందని మచిలీపట్నంలో అందరికీ తెలుసు. హత్య జరిగిన సమయంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అధికారుల వద్దనే వున్నారు. రవీంద్రకు క్రిమినల్‌ రికార్డు లేదు. మోకా భాస్కరరావుకు క్రిమినల్‌ రికార్డు ఉన్నది. రవీంద్రపై కేసు పెట్టిన పోలీసు కాసు మహేష్‌రెడ్డిపై ఎందుకు పెట్టలేదు?

5. దళిత యువకుడు వరప్రసాద్‌ శిరోముండనానికి బాధ్యుడైన వైకాపా నేత కృష్ణమూర్తిపై ఎందుకు కేసు పెట్టలేదు? చట్టప్రకారం కాకుండా అధికార పార్టీకి ఎందుకు తలొగ్గారు?

6. ఏడాదైనా వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో దర్యాప్తు ఎందుకు పూర్తి చేయలేదు? సీఎం గారి సోదరీమణి డా॥ సునీతారెడ్డి ఏపీ పోలీసుపై నమ్మకం లేదనే వరకు ఎందుకు తెచ్చుకొన్నారు? సీబీఐ విచారణకు ఉన్నత న్యాయస్థానం ఆదేశించే స్థితికి ఎందుకు తెచ్చుకొన్నారు?

7. మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు టెలిమెడిసిన్‌ వ్యవహారంలో విజిలెన్స్‌ రిపోర్టులో ఆయన పేరు చేర్చలేదు. తెంగాణాలో కూడా మంత్రిని బాధ్యుడిని చేయలేదు. ఇక్కడ ఉద్దేశపూరితంగా ఇరికించారు. అయినా మీరు విచారణకు రమ్మంటే అచ్చెన్నాయుడు రాలేదా? విచారణకు పివకుండానే త్లెవారుజామున వందమంది పోలీసు ఆయన ఇంటిపై పడడమేమిటి? ముందురోజే ఆపరేషన్‌ చేసుకొన్న మాజీ మంత్రిని వంద కిలోమీటర్లు 12 గంటలు తిప్పడమేమిటి? రాజకీయ ఒత్తిడుకు మీరు తలవంచారనేందుకు ఇది రుజువు కాదా?

8. తన ఎదుట వున్న సీఐ దళిత అధికారని జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఎలా తెలుసు? ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం రాజకీయ ఒత్తిడికి తలొంచడం కాదా? కరోనా ప్రోటాకాల్‌ ఉ్లంఘించారని 24 గంటల్లోనే ప్రభాకర్‌రెడ్డిని అరెస్టు చేశారు. మరి కాళహస్తి ఎమ్మెల్యే, నగరి ఎమ్మెల్యే, పలమనేరు ఎమ్మెల్యే, ఎంపీ విజయసాయిరెడ్డి, స్పీకర్‌ తమ్మినేని సీతారాంలతో పాటు అనేకమంది కరోనా ప్రోటోకాల్‌ ఉ్లంఘించారని అనేక రుజువు మీ కళ్ళముందు వున్నాయి. వారిపై ఎందుకు కేసు పెట్టలేదు?

9. స్థానిక సంస్థ నామినేషన్ల పర్వంలో 70 ఏళ్లలో ఏనాడైనా అంత హింస జరిగిందా? నామినేషన్‌  పత్రాలు లాక్కొని వెళ్ళిన వైకాపా నేతల్ని ఎందుకు అదుపు చేయలేదు? నామినేషన్లు అడ్డుకొన్న నేతపై ఎందుకు చర్యు తీసుకోలేదు? విఫమైన అధికారుపై చర్యలు తీసుకోమని ఆదేశించిన ఎన్నిక కమీషనర్‌ ఆదేశాలు ఎందుకు పాటించలేదు?

10. చెన్నైకి ఒంగోలు నుండి తరలిస్తున్న రూ.5 కోట్లను తమిళనాడు పోలీసు మొదటి చెక్‌పోస్టులోనే పట్టుకొన్నారు. ఒంగోలు నుండి తడ దాకా ఎన్నో చెక్‌పోస్టున్నా ఎందుకు ఏపీ పోలీసు పట్టుకోలేకపోయారు? ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఫోర్జరీ చేసి తిరిగే ఫార్చునర్‌ కారును ఎందుకు పట్టుకోలేకపోయారు?

11. చట్టవిరుద్ధంగా గుట్కా తయారీ గుంటూరు`1 ఎమ్మెల్యే షెడ్డులో జరిగింది. తయారీదారు మంగళగిరి ఎమ్మెల్యే బంధువని వార్తలు వచ్చాయి. ఆ ఇరువురు ఎమ్మెల్యేలపైన ఏ చర్యలు తీసుకున్నారు?

12. కారు లోపలే కూర్చుని వున్న మాజీ మంత్రి నారా లోకేష్‌పై నందిగామలో ఎందుకు కేసు నమోదు చేశారు? కారులో కూర్చుని వున్న మాజీ మంత్రి కరోనా నిబంధను ఎలా 
ఉ్లంఘిస్తారు? నారా లోకేష్‌పై కేసు నమోదు అధికార పార్టీ ఒత్తిడికి తలవంచడం కాదా? చట్టాన్ని దుర్వినియోగపరచడం కాదా?

13. జెడ్‌ కేటగిరి భద్రతలో వున్న మాజీ సీఎం ఇంటి గేట్లను తాళ్ళతో బంధించడం ఏమిటి? వారి ఇంటిపై డ్రోన్‌ ఎగరేసిన సీయం గారి ఇంట్లో వున్న వైకాపా వ్యక్తిని కాపాడడానికి ఇద్దరు పోలీసు అధికారులు చెరో రకంగా ప్రకటను చేసింది వాస్తవం కాదా?

14. దళిత జడ్జి రామకృష్ణ గారిని కించపరుస్తూ బహిరంగ ప్రకటన చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు? చట్టం వారి చుట్టమా?

15. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌గారి కుమారుడు డా॥ శివరాం ఆఫ్రికా దేశంలో వున్న రోజునే ఇక్కడ ఆయన దళితుడిని ధూషించినట్లు కేసు నమోదు చేశారు. ఆఫ్రికాలో వున్న వ్యక్తి గుంటూరు జిల్లాలో దూషించినట్టు కేసు నమోదు చేయడం చట్టాన్ని దుర్వినియోగం చేయడం కాదా? డా॥ కోడెల శివప్రసాద్‌గారి ఆత్మహత్య పోలీసు వేధింపు కాదా?

16. పోస్ట్‌ ఫార్వర్డ్‌ చేశారని విశాఖ నివాసి 65 ఏళ్ల నంద కిశోర్‌పై అక్రమ కేసు పెట్టడమే కాక అతన్ని వందలాది కిలోమీటర్లు తిప్పి కర్నూలు కోర్టులో ఎందుకు పెట్టారు? పోలీసు వేధింపు వల్లే ఆయన మరణించలేదా?

17. సెంట్రల్‌ లాక్‌ సిస్టమ్‌ వున్న పోలీస్‌ వాహనం నుండి చీరా కిరణ్‌ ఎలా దూకగలడు? అతని హత్యకు కారణమైన వారిపై సెక్షన్‌ 302 ఎందుకు పెట్టలేదు?

18. శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ, విజయవాడ మాజీ మేయర్‌ పంచుమర్తి అనురాధపై ఫిర్యాదు ఇచ్చినా బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారు?

19. హైకోర్టు న్యాయమూర్తును దారుణంగా దూషిస్తూ పోస్టు పెట్టిన వారిపై వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదు?

20. కావలిలో ఎన్‌టిఆర్‌ విగ్రహం తొలగింపుకు సహకరించిన పోలీసు అధికారిపై ఏం చర్య తీసుకున్నారు?

21. పెండ్లికి వెళ్లిన మాజీ మంత్రు యనమ రామకృష్ణుడు, నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అధికార పార్టీకి తలవంచడం కాదా?

22. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుని తాత ఫోటోను అక్రమంగా మున్సిపల్‌ కార్యాలయంలో తొలగించారు. వారిపై చర్యలు తీసుకోకపోగా దానిపై భావోద్వేగానికి గురైన మాజీ మంత్రిపై దిశ చట్టం క్రింద కేసు పెట్టడం అధికార పార్టీకి తలవంచడం కాదా?

23. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై మాచర్లలో హత్యా ప్రయత్నం చేసిన కిషోర్‌పై అటెంప్టివ్‌ మర్డర్‌ కేసు పెట్టకపోవడం చట్టాన్ని గౌరవించడమేనా?

24. రాజధాని గ్రామాల్లో బాలింతను బూటు కాలితో తన్నడం చట్ట సమ్మతమేనా? గ్రామాల్లో వందలాది మంది పోలీసులతో కవాతు ఏమిటని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది వాస్తవం కాదా?

25. వైఎస్‌ పానలో వారి ఒత్తిడికి తలొంచి చట్టవిరుద్ధంగా వెళ్ళిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికాయి కేసుకు గురై జైళ్ళపాలై ప్రతిష్ట కోల్పోయారు. కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ కాగలిగే శ్రీక్ష్మిగారి ప్రతిష్ట, ఆరోగ్యం దెబ్బతిన్నది. జగన్‌ పాలనలో మాజీ జడ్జి ఈశ్వరయ్య అధికార పార్టీ నేతు చెప్పింది చేసి ఇరుకునపడ్డారు. మరే అధికారికి ఇలాంటి స్థితి రాకూడదని తెలుగుదేశం కోరుకుంటున్నది. ప్రతిష్టాత్మకంగా, ప్రశాంతంగా రిటైర్మెంట్‌ జీవితం గడపాని కోరుకుంటున్నాం.

(నిమ్మకాయ చినరాజప్ప)

మాజీ హోంశాఖా మంత్రి

Follow Us:
Download App:
  • android
  • ios