ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు.

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి ప్రధాని నరేంద్రమోడీయే కారణమని అర్థం వచ్చేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

‘‘ప్రధాని నరేంద్రమోడీ ఏ అరాచకానికైనా సమర్థుడేనని..గోద్రాలో రెండు వేల మందిని బలి తీసుకున్న నరమేధాన్ని మరవలేమని... ప్రపంచ ఆర్ధిక సదస్సుకు ఆయనను అనుమతించలేదు.

విదేశాలు కూడా మోడీని బాయ్‌‌కాట్ చేశాయని... సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వాల అస్థిరత ప్రమాదకరమని, సరిహద్దు రాష్ట్రాల్లో రాజకీయం లబ్ధి చూడరాదు’’ అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం సంచలనం కలిగించింది.