కాంగ్రెస్ లో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

ex cm kiran kumar reddy joined in congress today in the presence of rahul gandhi
Highlights

ఎన్నికల తర్వాత నాలుగేళ్లపాటు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు ఊమెన్‌ చాందీతో భేటీ అయ్యారు


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు కాంగ్రెస్‌లో చేరారు. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన జైసమైక్యాంధ్ర పార్టీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. గత ఎన్నికల్లో ఆ పార్టీకి కనీస డిపాజిట్లు కూడా దక్కలేదు. దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

2014 ఎన్నికల తర్వాత నాలుగేళ్లపాటు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు ఊమెన్‌ చాందీతో భేటీ అయ్యారు. చాందీ ఆహ్వానం మేరకు తిరిగి కాంగ్రెస్‌లో చేరడానికి అంగీకరించిన ఆయన గురువారం దిల్లీకి చేరుకున్నారు. 

 ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఊమెన్‌చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

loader