విజయవాడ వాంబే కాలనీలో ఈవెంట్ డ్యాన్సర్ అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపుతోంది. గాయత్రి అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె బలవన్మరణానికి ముందు నీలిమ అనే యువతి గాయత్రి ఇంటికి వచ్చింది.

ఆ సమయంలో ఇద్దరు యువతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నీలిమ వెళ్లిన తర్వాత గాయత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదే సమయంలో గాయత్రి భర్త పిల్లలతో కలిసి బయటకు వెళ్లాడు.

అయితే గాయత్రి మరణంపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గాయత్రితో గొడవపడ్డ నీలిమ పరారీలో వుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు  చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.