టీడీపీ ఓడిపోయినప్పటికీ దివంగత నేత ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యులు మాత్రం అందరూ గెలిచారు. టెక్కలి నుంచి ఎర్రన్నాయుడి సోదరుడు అచ్చెన్నాయుడు గెలవగా, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి ఎర్రన్నాయుడి తనయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గెలిచారు. ఎర్రన్నాయుడి కుమార్తె, రామ్మోహన్ నాయుడి సోదరి ఆదిరెడ్డి భవాని రాజమండ్రి సిటీ స్థానం నుంచి గెలుపొందారు. 

ఎర్రన్నాయుడి సోదరుడిగా అచ్చెన్నాయుడు శ్రీకాకుళం రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఇక రామ్మోహన్ నాయుడు మంచి వాక్చాతుర్యంతో పార్లమెంట్ లో తన గొంతుని బలంగా వినిపించారు. వైఎస్ జగన్ హావలో కూడా ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యులు విజయం సాధించడం విశేషం.