విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ఇంగ్లాండ్ క్రికెటర్లు (వీడియో)
ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను ఇంగ్లాండ్ క్రికెటర్లు దర్శించుకున్నారు.
విజయవాడ : ఇంగ్లాండ్ అండర్ 19 క్రికెట్ టీం ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఇంగ్లాండ్ అండర్ 19 బృందానికి దగ్గరుండి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆటగాళ్లకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. అలాగే అధికారులు అండర్మ్మవారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేసారు.
వీడియో