డీసీ పుష్పవర్ధన్‌పై ఇసుక కొట్టిన ఏసీ శాంతి: నోటీసిచ్చిన ఎండోమెంట్ కమిషనర్
దేవాదాయశాఖకు చెందిన డీసీ పుష్పవర్ధన్ పై ఇసుక కొట్టిన అసిస్టెంట్ కమిషనర్ శాంతికి దేవాదాయశాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ నోటీసులు ఇచ్చారు. నెల రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేశాదాయశాఖకు చెందిన ఉద్యోగుల మధ్య వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విశాఖ రీజియన్ లో దేవాదాయశాఖ డీసీ పుష్పవర్ధన్ ముఖంపై ఇసుక కొట్టిన అసిస్టెంట్ కమిషనర్ శాంతికి దేవాదాయశాఖ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
also read:దేవాదాయశాఖలో అధికారుల మధ్య గొడవ: డీసీపై ఇసుక, మట్టిపోసిన ఏసీ శాంతి
ఈ ఏడాది ఆగష్టు 5 వ తేదీన తన ఛాంబర్‌లో కూర్చొని ఇతర ఉద్యోగులతో డీసీ Pushpavardhan మాట్లాడుతున్న సమయంలో అదే శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న Shanthi ఇసుక తీసుకొచ్చి కొట్టారు. తనను మానసికంగా డీసీ పుష్పవర్ధన్ వేధింపులకు గురి చేశాడరని ఆమె ఆరోపించారు. దీంతో తాను ఏమీ చేయలేక Sand కొట్టినట్టుగా ఆమె వివరించారు.
అంతకుముందు,ఆ తర్వాత కూడ డీసీ పుష్పవర్ధన్, అసిస్టెంట్ కమిషనర్ శాంతి మధ్య వివాదం కొనసాగింది. తన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను డీసీ పుష్పవర్ధన్ రెచ్చగొడుతూ తనకు వ్యతిరేకంగా పురమాయిస్తున్నాడని ఆమె ఆరోపించారు. ఈ ఇధ్దరు అధికారుల మధ్య నెలకొన్న విబేధాలపై ఆర్‌జేసీ సురేష్ వేర్వేరుగా విచారణ నిర్వహించారు. గతంలో కూడ డీసీ పుష్పవర్ధన్ పై ఏసీ శాంతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై రాజమండ్రిలో ఉన్నతాధికారులు విచారణకు పిలిచారు. అయితే ఆ సమావేశానికి డీసీ పుష్పవర్ధన్ హాజరు కాలేదని ఏసీ శాంతి గతంలోనే ఆరోపించారు.
మరోవైపు ఇటీవలనే అసిస్టెంట్ శాంతి తీరు నచ్చక ఆమె కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా సామూహికంగా Leaveపై వెళ్లిపోయారు. దీంతో దేవాదాయశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొన్నారు.సెలవులో వెళ్లిన ఉద్యోగులకు నచ్చజెప్పి విధులకు హాజరయ్యేలా చూశారు.
ఈ పరిణమాలపై దేవాదాయశాఖ సీరియస్ అయింది. అసిస్టెంట్ కమిషనర్ శాంతికి దేవాదాయశాఖ కమిషనర్ Hari jawaharlal నోటీసులిచ్చారు. 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆయన ఆదేశించారు.ఈ ఇద్దరు ఉద్యోగుల మధ్య వివాదంపై గతంలో ఆర్‌జేసీ విచారణ నిర్వహించారు. అయితే విచారణలో ఏం తేలిందనే విషయాన్ని బహిర్గతం చేయలేదు. ఈ ఇద్దరి మధ్య చోటు చోటు చేసుకొన్న వివాదానికి పుల్‌స్టాప్ పెట్టే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ దఫా రంగంలోకి దిగిందని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.