ఛలో విజయవాడ: బీఆర్‌టీఎస్ రోడ్డులో ఉద్రిక్తత, పలువురి అరెస్ట్


పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు గురువారం నాడు ఛలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. 

Employees  condcuts Rallyh at BRTS Road in Vijayawada

విజయవాడ: PRC సాధన సమితి తలపెట్టిన ఛలో Vijayawada  కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. అయితే గురువారం నాడు  Employees, Teachers సంఘాల నేతలు మారు వేషాల్లో ఎన్జీవో కార్యాలయానికి చేరుకొన్నారు.

భారీ సంఖ్యలో ఉద్యోగ,ఉపాధ్యాయులు BRTS రోడ్డు వద్దకు చేరుకోవడంతో పోలీసులు  వారిన అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్యోగులు,ఉపాధ్యాయులు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. పోలీసులకు ఉద్యోగులకు మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో ఉద్రిక్త త  నెలకొంది.  

పీఆర్సీ స్టీరింగ్ కమిటీ కీలక నేతలు బైక్ లపై NGO భవన్ కు చేరుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. పీఆర్సీ సాధన సమితి స్టిరింగ్ కమిటీ సభ్యులు వెంకట్రామిరెడ్డి బైక్ పై ఎన్జీవో కార్యాలయానికి బయలుదేరాడు. ఎన్జీవో భవన్ వద్దకు పీఆర్సీ స్టీరింగ్ కమిటీ  కీలక నేతలు వచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు భారీ మోహరించారు. 

ఎన్జీవో భవనం నుండి బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు వందలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ర్యాలీగా బయలుదేరారు. ఉపాధ్యాయ, ఉద్యోగులు ఎర్ర జెండాలను చేతబూని న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ జీవో రద్దు చేయాలని ముద్రించిన మాస్కులను ఉద్యోగులు  ధరించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు జనవరి 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం   YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే జనవరి 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ పై ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందించలేదు. దీంతో సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి.  జనవరి 24న రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె  నోటీసును అందించాయి. సమ్మె  ప్రారంభించే రోజు వరకు  పలు ఆందోళన కార్యక్రమాలను కూడా పఆర్సీ సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిసున్నారు ఉద్యోగ సంఘాలు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios