యువతిపై అత్యాచారం కేసులో పశ్చిమగోదావరి జిల్లా ధర్మాజీగూడెం ఎస్ఐ లంకా రాజేష్ ను ఏలూరు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ జీవీఎస్ పైడేశ్వరరావు  అరెస్టు చేశారు. తనను మ్యారజ్ బ్యూరోలో పరిచయం చేసుకొని పెళ్లిచేసుకుంటానని హామీ ఇచ్చాడు.

ఆ హామీతోనే తనను ధర్మాజీగూడెంలో ఉన్న పోలీస్‌ క్వార్టర్స్‌కు పిలిపించుకుని ఎస్‌ఐ రాజేష్‌ అత్యాచారానికి పాల్పడ్డారని వరంగల్‌కు చెందిన యువతి ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దీంతో ఎస్‌ఐను అరెస్టు చేసి మంగళవారం ఏలూరు కోర్టులో హాజరుపరచగా 15 రోజులు రిమాండ్‌ విధించారు. ఇదిలావుండగా ఎస్‌ఐ రాజేష్ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడంతో ఆయనను సస్పెండ్‌ చేస్తూ జిల్లా ఎస్పీ గ్రేవాల్‌ ఉత్తర్వులు జారీచేశారు.