ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజలు హటాత్తుగా అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఇప్పుడు కేవలం ఏలూరులోనే కాదు యావత్ ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఆందోళనకు కారణమయ్యింది. అయితే నెల్లూరు ప్రజల అనారోగ్యానికి లెడ్ హెవీ మెటల్ కారణమని ఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించిన పరీక్షల్లో తేలిందని  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. 

నెల్లూరు వింతవ్యాధి గురించి జివిఎల్ మాట్లాడుతూ...ముందునుండి అనుమానినించినట్లే పేషెంట్స్ బ్లడ్ శాంపిల్స్ లో ఎక్కువగా "లెడ్" అనే హెవీ మెటల్ మరియు నికెల్ అనే మెటల్ వున్నట్లు ఎయిమ్స్ పరీక్షల్లో తెలిసిందన్నారు. ముఖ్యంగా లెడ్ కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు కనిపిస్తాయన్నారు. 

''లెడ్ బ్యాటరీస్ లో ఉండే పదార్ధం. ఇది తాగు నీటి ద్వారా లేదా పాల ద్వారా పేషెంట్స్ శరీరంలో వెళ్లి ఉండవొచ్చని అంచనా. సాంపిల్స్ టెస్ట్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిమ్స్ మంగళగిరి ద్వారా అందజేయటం జరిగింది. వెంటనే ఏ మార్గం ద్వారా వారి శరీరాల్లో ప్రవేశించిందో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ స్థానికంగా తెలుసుకోవాలి'' అని పేర్కొన్నారు. 

''వాటర్, పాల శాంపిల్స్ పంపించాలని ఎయిమ్స్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను అడుగుతోంది. మెటల్స్ ను డిటెక్ట్ చేసే అధునాతన పరికరాలు ఎయిమ్స్ ఢిల్లీలో మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలి'' అని జివిఎల్ సూచించారు.

read more  ఏలూరు మాయరోగం ఘటనలో ట్విస్ట్: ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పందన ఇదీ...

ఇదిలావుంటే వింత వ్యాధితో బాధపడుతున్న రోగుల సంఖ్య 451 కి చేరింది. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో రోగులు చికిత్స పొందుతున్నారు. గంట గంటకు రోగుల సంఖ్య పెరిగిపోతోంది.
 
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 169కి చేరుకొంది. ఇప్పటికే 263 మందిని డిశ్చార్జ్ చేశారు. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. 17 మంది బాధితులను మెరుగైన చికిత్స కోసం గుంటూరు, విజయవాడ ఆసుపత్రికి తరలించారు.

శనివారం నుండి వింత వ్యాధి ప్రారంభమైంది.సోమవారం నాడు బాధితులను సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఆదివారం నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పరామర్శించారు. ఈ ఘటనను ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకొంది. డిప్యూటీ సీఎం ఆళ్లనాని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్ వైద్యులను ఆదేశించారు.