ఏలూరు: నగరంలో వింతవ్యాధికి నీటి కలుషితమే కారణమని నివేదికలు చెబుతున్నాయి. బాధితులు తాగిన నీటిలో సీసం ఆనవాళ్లు ఉన్నట్టుగా నివేదికలు తేల్చాయి, బాధితులు తీసుకొన్న నీటిలో సీసంతో పాటు హెవీ మెటల్స్, కెమికల్స్ నమూనాలున్నాయని తేలింది.

also read:ఏలూరు వింత వ్యాధి : అంతు తేల్చేందుకు హైపర్ కమిటీ ఏర్పాటు...

బాధిత ప్రాంతాల నుండి సేకరించిన నీటి నమూనాల్లో సీసంతో పాటు హెవీ మెటల్స్ ఉన్నట్టుగా ఎయిమ్స్ నివేదిక తేల్చింది. నీటిలో సీసం ఉన్నట్టుగా మూడోసారి ఎయిమ్స్ నివేదిక తేల్చింది. శుక్రవారం నాడు మధ్యాహ్నం ఎయిమ్స్ మూడో నివేదిక అందింది.

ఈ నీటిలో సీసంతో పాటు ఆర్గానో క్లోరిన్, డైక్లరో మిథేల్స్, డీడీడీ, డీడీటీ, డీడీఈ ఉన్నట్టుగా ఎయిమ్స్ నివేదికలు గుర్తించాయి. బాధిత ప్రాంతాల నుండి 40 శాంపిల్స్ ను ఇటీవల ప్రభుత్వం ఎయిమ్స్ కు పంపిన విషయం తెలిసిందే. తుది నివేదిక కోసం మరోసారి 80 శాంపిల్స్ ను ప్రభుత్వం పంపింది.పాలు, నీటిని కూడ ఈ దఫా పంపింది.

also read:అన్ని రిపోర్టులు రేపే, కేసులు తగ్గుతున్నాయి: వింత వ్యాధిపై ఆళ్ల నాని

బాధిత ప్రాంతాల్లోని కూరగాయాలు, కారం ఇతర ఆహార పదార్ధాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని ఈ నివేదిక తేల్చింది. ఇవాళ సాయంత్రానికి ఇతర సంస్థల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.