Asianet News TeluguAsianet News Telugu

తిరుమల ఘాట్ రోడ్డులో కలకలం: ఏనుగుల గుంపు సంచారం

తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచరిస్తుంది. ఐదు ఏనుగుల గుంపు సంచరిస్తుందని అధికారులు గుర్తించారు.ఈ ఏనుగులను అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు చర్యలు తీసుకొంటున్నామని అధికారులు చెప్పారు.

Elephant herd roaming at Tirumala Ghat Road
Author
Tirupati, First Published Feb 7, 2022, 7:48 PM IST

తిరుపతి: Tirumala మొదటి ఘాట్ రోడ్డులో Elephants గుంపు సంచరిస్తుంది. ఐదు ఏనుగుల గుంపు సంచరిస్తుందని అధికారులు గుర్తించారు.  మొదటి Ghat  రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏనుగులు సంచరిస్తున్నాయని కొందరు భక్తులు TTD అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏనుగులు సంచరించిన ప్రాంతాన్ని సోమవారం నాడు రాత్రి టీటీడీ అదనపు ఈవో Dharma Reddy పరిశీలించారు. 

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసే సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈవో సూచించారు.  రోడ్డుకు చివర్లో ఉన్న బారికేడ్లను  దాటుకొని ఏనుగులు రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ మార్గంలో ప్రయాణం చేసే devotees  అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నామని ధర్మారెడ్డి ప్రకటించారు.

గతంలో ఘాట్ రోడ్డు మార్గంతో పాటు ఆలయానికి సమీపంలో కూడా పులులు సంచరించినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఘాట్ రోడ్డు మార్గంలో పలు సార్లు పులులు కంటబడ్డాయి. మెట్ల మార్గంలో కూడా పులులు సంరించిన ఘటనలు కూడా లేకపోలేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు,శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏనుగుల సంచారం సాగుతుంది. పంట పొలాల్లోకి వచ్చి ఏనుగులు పంటలను నాశనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఏనుగుల గుంపుల నుండి తమను కాపాడాలని కూడా స్థానికులు అధికారులకు మొర పెట్టుకొన్న ఘటనలు కూడా ఉన్నాయి.అయితే తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచారంతో  టీటీడీ కూడా అప్రమత్తమైంది.  


 

Follow Us:
Download App:
  • android
  • ios