వాహనసేవలో మావటిపై దాడి

తిరుమలలో శ్రీవారి గజరాజు భీభత్సం సృష్టించింది. ‘అవనిజ’ అనే ఏనుగు గట్టిగా ఘీంకరిస్తూ మావటిపై దాడి చేసింది.

ససహస్రదీపాలంకార సేవ తర్వాత తిరువీధుల్లో నిర్వహించే వాహనసేవలో పాల్గొనేందుకు గజరాజులను ఆలయం వద్దకు తీసుకొచ్చారు.

ఈ సమయంలో బెదిరిన ‘అవనిజ’ అనే ఏనుగు మావటి గంగయ్యను కిందపడేసింది.

అతనిపై దాడికి దిగింది. కాలిపై తొక్కడంతో అతడి కాలు విరిగింది. గాయపడిన గంగయ్యను ఆసుపత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు.