Asianet News TeluguAsianet News Telugu

హాస్పిటల్ లో షార్ట్ సర్క్యూట్... కరోనా పేషెంట్స్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం

విజయనగరం జిల్లాలోని ఓ హాస్పిటల్ లో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. 

Electrical Short Circuit in vijayanagaram hospital akp
Author
Vijayanagaram, First Published May 25, 2021, 3:56 PM IST

విజయనగరం జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న విజయనగరంలోని ఎంఆర్ కేంద్ర ఆస్పత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగాయి. అయితే హాస్పిటల్ సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని గమనించి విద్యుత్ సరఫరాను నిలిపివేసి మంటలను అదుపుచేశారు. దీంతో ప్రమాదం తప్పడంతో కోవిడ్ రోగులతో పాటు సహాయకులు, హాస్పిటల్ యాజమాన్యం, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

read more  విశాఖ హెచ్పీసీఎల్ భారీ అగ్నిప్రమాదం... కమ్ముకున్న నల్లని పొగలు

గతేడాది విజయవాడలో కరోనా వైరస్ చికిత్స కోసం రమేష్ హాస్పిటల్ ఉపయోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ బిల్డింగ్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒక్కసారిగా బిల్డింగ్ లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో చాలామంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయాలపాలయ్యారు.ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోకుండా విజయనగరం హాస్పిటల్ సిబ్బంది అడ్డుకున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios