విజయవాడలో ఓ ఘరానా దొంగతనం బయటపడింది. రూ. 500 లకే టీవీలు అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకోగా షాకింగ్ విషయాలు బైట పడ్డాయి. 

విజయవాడ, జగ్గయ్యపేట మండలం గౌరవరం జాతీయ రహదారిపై రూ. 9లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గౌరవరం వద్ద రూ. 500 టీవీని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అనుమానం వచ్చింది. 

దీంతో వారిని పట్టుకుని విచారించారు. ఎనికేపాడు ఎల్ జీ షోరూం నుంచి భీమవరం వెళ్లేందుకు ఎలక్ట్రానిక్ పరికరాలతో సిద్ధంగా ఉంచిన ఆటోను యూపీకి చెందిన వ్యక్తులు దొంగిలించి పారిపోయారు. ఎనికేపాడు ఎల్ జీ షోరూం వద్ద దొంగిలించి వాటిని హైదరాబాద్ తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలో గౌరవరం వద్దకు రాగానే డీజిల్ అయిపోవటంతో టీవీని రూ. 500లకు అమ్మే ప్రయత్నంలో ఘరానా దొంగలు పోలీసులకు చిక్కారు.